Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత పెంపు.. ప్రత్యేక సిబ్బంది నియామకం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆలయానికి పోలీస్ భద్రత పెంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు..

Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత పెంపు.. ప్రత్యేక సిబ్బంది నియామకం
Yadadri Temple
Follow us
Srilakshmi C

|

Updated on: May 03, 2023 | 8:57 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆలయానికి పోలీస్ భద్రత పెంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయానికి మరింత భధ్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందికి తోడు మరికొంత మందిని నియమించింది. ఇటీవలే ఏసీపీ స్థాయి అధికారితో పాటు టీఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది.

తాజాగా యాదాద్రి ఆలయానికి పోలీస్ భద్రత పెంచిన క్రమంలో 34 మంది అదనపు ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. 34 మందిని అదనంగా నియమించగా ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్షంలో నేడు 17 మంది సిబ్బంది విధుల్లో చేరారు. కొండపైన ప్రతీ కోణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అద్భుతమైన దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను సందర్శించే భక్తులకు రక్షణ.. ఆలయ పరిసరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.