Cyber Crime: పోలీసులకు చిక్కిన మహా సైబర్ నేరగాడు.. చదివింది పన్నెండే.. దోచుకునేది రోజుకు రూ.5 కోట్లు
చదివింది పన్నెండో తరగతి మాత్రమే.. కానీ సైబర్ నేరాలలో దిట్ట. అమాయక ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నిత్యం కోట్ల రూపాయల సొమ్ము దోచుకుంటూ బురిడికొట్టించడంలో ఆరితేరిపోయాడు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా ఎన్నో..
చదివింది పన్నెండో తరగతి మాత్రమే.. కానీ సైబర్ నేరాలలో దిట్ట. అమాయక ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నిత్యం కోట్ల రూపాయల సొమ్ము దోచుకుంటూ బురిడికొట్టించడంలో ఆరితేరిపోయాడు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన నేరగాడిని ముంబయి పోలీసులు బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే..
దాడి శ్రీనివాసరావు (49) అనే వ్యక్తి పన్నెండో తరగతి వరకు మాత్రమే చదివాడు. సైబర్ నేరాల ద్వారా రోజుకు రూ.5 కోట్లకు పైగా మోసాలకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి నిందితుడిని బాంగుర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు ఠాణెకు, మరో ఇద్దరు కోల్‌కతాకు చెందినవారు. ఇలా లావాదేవీలు జరుపుతున్న 40 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ నేరాలు ఇలా చేసేవారు..
టెలిగ్రామ్ యాప్‌తోనే ఎవరితోనైనా శ్రీనివాసరావు సంప్రదింపులు జరిపేవాడు. మహిళలకు టార్గెట్ చేస్తూ వారికి ఫోన్లు చేసి.. మీరు పంపిన కొరియర్‌లో డ్రగ్స్ దొరికాయని, కొరియర్ మీది కాదని నిరూపించుకోవాలంటే తక్షణం బ్యాంకు వివరాలు పంపాలని ఆదేశించేవాడు. దీంతో భయభ్రాంతులకు గురై చాలామంది ఆ వివరాలను ఇచ్చేవారు. ఓటీపీలను సైతం పంచుకునే వారు. అనంతరం బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేవారు. ఇలా దేశవ్యాప్తంగా వేలమంది నుంచి రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు లావాదేవీలు జరిపేవారు. దోచుకున్న మొత్తం సొమ్ము ఓ చైనా వ్యక్తి ఖాతాలో జమయ్యేదని పోలీసులుతెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.