మరింత స్వీట్ వాయిస్ కోసం.. స్నేక్ స్పెర్మ్ తాగిన సింగర్.. కట్ చేస్తే.!
సాధారణంగా సింగర్స్ తమ స్వరాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి వివిధ రకాల సంప్లిమెంట్స్ తీసుకుంటారు. అలాగే ఎన్నో విధానాలను పాటిస్తారు. కానీ ఓ సింగర్ తన గాత్రాన్ని మరింత స్వీట్ గా మార్చుకోవడానికి ఏకంగా పాము స్పెర్మ్ తాగిందట. ఇప్పుడు ఈ విషయంలో సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు.. ? అసలు చెప్పిన ఈ కాకటైల్ ఏంటీ ? అనే విషయాలు తెలుసుకుందామా..

సినీరంగంలో నటీనటులు తమ ఫిట్నెస్, అందాన్నిపెంచుకోవడానికి అనేకి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే తమ వాయిస్ కాపాడుకోవడానికి.. లేదా మరింత అందంగా మార్చుకోవడానికి సింగర్స్ సైతం పలు సప్లిమెంట్స్ తీసుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. ఆమె తన గాత్రాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి ఆమె పాము స్పెర్మ్ తాగుతుందట. అవును.. ప్రముఖ అమెరికన్ గాయని జెస్సికా సింప్సన్ తన మధురమైన స్వర రహస్యాన్ని వెల్లడించే వీడియోను పంచుకున్నారు. 44 ఏళ్ల “స్వీట్ కిసెస్”, “ఇన్ ది స్కిన్” గాయని తన గొంతును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాము స్పెర్మ్‌తో కూడిన చైనీస్ మూలికల కాక్‌టెయిల్ తాగుతున్నట్లు చెప్పింది. ఈ విషయం తనకు సంగీతం నేర్పిన సంగీత శిక్షకుడు చెప్పాడని.. అందుకే తన గురువు చెప్పినట్లుగానే పాము స్పెర్మ్ కాకటైల్ తాగుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ సింగర్ తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె చేతిలో ఎల్లో కాలర్ బాటిల్ లో ఓ డ్రింక్ తాగుతుంది. అదేంటీ అని అక్కడున్న వారు అడగ్గా.. ఇది చైనీస్ డ్రింక్. ఇది నాకు తెలియదు. కానీ నా మ్యూజిక్ ట్రైనర్ దీనిని తాగమని చెప్పాడు అని తెలిపింది. దీంతో అసలు ఆమె తాగుతున్న డ్రింక్ గూరించి గూగుల్ సెర్చ్ చేశారు నెటిజన్స్. అయితే అందులో పాము స్పెర్మ్ ఉంటుందని.. అది తేనెలాగే ఉంటుందని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
తన గొంతును తీపిగా.. మరింత అందంగా ఉంచుకోవడానికి ఆమె చైనాకు చెందిన స్నేక్ స్పెర్మ్ కాకటైల్ తాగుతున్నట్లు తెలిపింది. ఆమె చెప్పిన విషయం విని జనాలు షాకవుతున్నారు. “మీకు మంచి గాత్రం కావాలంటే, మీరు పాము స్పెర్మ్ తాగాలి!” అంటూ జెస్సికా చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..




