10 January 2026

ఆ అందం వెనుక రహస్యం ఇదేనట.. రుక్మిణి వసంత్ చెప్పిన క్రేజీ చిట్కాలు..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్. తెలుగు, కన్నడ, తమిళం భాషలలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవలే కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ హృదయాలు దోచుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్, నీల్ చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ తన స్కిన్, బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసింది.

తన అందానికి రహస్యం క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అని తెలిపింది. తాను రెటినోల్ ఉపయోగిస్తానని.. తగినంత విశ్రాంతి తీసుకుంటానని తెలిపింది.

అలాగే తనను తాను హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ముఖ్యమని తెలిపింది. వాటర్ బాటిల్ లేకుండా తాను ఎప్పుడూ ఉండనని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

కనీసం రోజుకు మూడు లీటర్లు నీరు తాగుతానని తెలిపింది. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా చాలా ఇష్టమని, అందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయని తెలిపింది.

జుట్టుకు కొబ్బరి నూనె ఉపయోగిస్తానని తెలిపింది. అలాగే హెయిర్ మాస్క్, షాంపూలను ఉపయోగిస్తానని తెలిపింది. యోగతోపాటు వ్యాయామం చేస్తుందట.

చర్మం అందంగా కనిపించాలంటే ఆహారంతోపాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమే అంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమంటుంది.