- Telugu News Photo Gallery Cinema photos Can You Guess The Actress Who Is With Mahesh Babu, She Is Heroine Sri Divya
Mahesh Babu: అప్పుడు మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అందాలతో వెర్రెక్కించే వయ్యారి.. క్రేజీ హీరోయిన్ ఫోటోస్ చూస్తే..
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మహేష్ జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో మహేష్ త్రోబ్యాక్ ఫోటో వైరలవుతుంది.
Updated on: Apr 04, 2025 | 1:31 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ ఎత్తుకున్న ఓ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఆ చిన్నారి మరెవరో కాదు.. హీరోయిన్ శ్రీదివ్య.

అచ్చ తెలుగమ్మాయి. చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాఫ్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతోపాటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

అచ్చ తెలుగమ్మాయి. చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాఫ్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతోపాటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ త్రోబ్యాక్ ఫోటో ఆ సినిమాలోనిదే. ప్రస్తుతం శ్రీదివ్య నెట్టింట చాలా యాక్టివ్.





























