Samsung TV’s: 4కే ఐ స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసిన సామ్‌సంగ్.. అదిరిపోయే డిజైన్‌తో అధునాతన ఫీచర్లు

తాజాగా 4కే టీవీలను లాంచ్ చేసింది. 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీవీల ధర రూ.33,990 నుంచి రూ.71,990గా ఉన్నాయి. ఈ సిరీస్ సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లైన ప్రశాంత ఆన్‌బోర్డింగ్ ఫీచర్‌తో అంతర్నిర్మిత ఐఓటీ హబ్, బ్రైట్‌నెస్ సర్దుబాటు కోసం ఐఓటీ సెన్సార్, స్లిమ్‌ఫిట్ కెమెరాతో వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి.

Samsung TV’s: 4కే ఐ స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసిన సామ్‌సంగ్.. అదిరిపోయే డిజైన్‌తో అధునాతన ఫీచర్లు
Samsung 4k Tv
Follow us
Srinu

|

Updated on: May 19, 2023 | 6:00 PM

భారతదేశంలో సామ్‌సంగ్ ఉత్పత్తులకు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. స్మార్ట్ ఫోన్స్‌తో పాటు సామ్‌సంగ్ గృహోపకరణాలను చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టీవీలు, ఫ్రిజ్‌ల వంటి గృహోపకరణాలను ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం టీవీల విషయం మాట్లాడుకుంటే తాజాగా అన్ని కంపెనీలు మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ తక్కువ ధరకే 4కే టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. పోటీ కంపెనీలకు మంచి పోటినిస్తూ సామ్‌సంగ్ కూడా తాజాగా 4కే టీవీలను లాంచ్ చేసింది. 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీవీల ధర రూ.33,990 నుంచి రూ.71,990గా ఉన్నాయి. ఈ సిరీస్ సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లైన ప్రశాంత ఆన్‌బోర్డింగ్ ఫీచర్‌తో అంతర్నిర్మిత ఐఓటీ హబ్, బ్రైట్‌నెస్ సర్దుబాటు కోసం ఐఓటీ సెన్సార్, స్లిమ్‌ఫిట్ కెమెరాతో వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. మంచి రిజల్యూషన్ ఇమేజ్‌లు, సౌండ్‌లను పెంచడానికి క్రిస్టల్ ప్రాసెసర్ 4కే సాంకేతికతతో ఈ టీవీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

క్రిస్టర్ 4కే ఐస్మార్ట్  యూహెచ్‌డీ టీవీ ఫీచర్లు

ఈ సిరీస్‌లోని టీవీలు హెచ్‌డీఆర్+కి మద్దతుతో ఒక-బిలియన్ రంగుల స్క్రీన్ ప్యానెల్స్‌తో వస్తున్నాయి. ఓటీఎస్ లైట్‌తో పాటు ఎడాప్టివ్ సౌండ్ టెక్నాలజీ, ఆడియో సామ్‌సంగ్ క్యూ సింపనీ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. అలాగే 4కే టీవీల్లో థియేట్రికల్ సౌండ్ అనుభూతిని అందించేలా రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  ఈ టీవీల్లో ఉండే ఆన్‌బోర్డింగ్ ఫీచర్‌తో పాటు ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా ఇతర శామ్‌సంగ్ పరికరాలను గుర్తించడంతో వాటికి సులభంగా కనెక్ట్ అవుతాయని తెలిపారు.  సామ్‌సంగ్ క్రిస్టల్ 4కే యూహెచ్డీ టీవీ 43-నుంచి65 అంగుళాల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ టెలివిజన్‌లు సామ్‌సంగ్ ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే లాంచింగ్ ఆఫర్ కింద 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సామ్‌సంగ్ ఆఫర్ చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..
వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..
పంబన్ బ్రిడ్జిపై హైస్పీడ్ రైలు పరుగులు.! భారతీయ రైల్వేలో అద్భుతం
పంబన్ బ్రిడ్జిపై హైస్పీడ్ రైలు పరుగులు.! భారతీయ రైల్వేలో అద్భుతం
కోనసీమలో వింత ఘటన.. ఆ చెట్టుకు తొమ్మిది తలలు.! వీడియో..
కోనసీమలో వింత ఘటన.. ఆ చెట్టుకు తొమ్మిది తలలు.! వీడియో..
పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. సీన్‌ చూసి పరుగో పరుగు
పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. సీన్‌ చూసి పరుగో పరుగు
25 లక్షల కోట్ల ఆస్తా !! పుడితే ఇలాంటి ఫ్యామెలీలోనే పుట్టాలి
25 లక్షల కోట్ల ఆస్తా !! పుడితే ఇలాంటి ఫ్యామెలీలోనే పుట్టాలి
లుక్కు మారింది.. ఇప్పుడు నిజంగా అదిరిపోయింది
లుక్కు మారింది.. ఇప్పుడు నిజంగా అదిరిపోయింది