- Telugu News Photo Gallery Technology photos Samsung launching new 5g smartphone in india Samsung galaxy f54 5g features and price
Samsung Galaxy f54 5g: సామ్‌సంగ్ నుంచి మరో కొత్త 5జీ ఫోన్.. 108 ఎంపీ కెమెరాతో పాటు.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ తాజాగా భారత మార్కెట్‌లోకి మిడ్ రేంజ్ వేరియంట్‌ను లాంచ్ చేస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్54 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం...
Updated on: May 19, 2023 | 1:50 PM

దేశీయంగా 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోన్న నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. అందులోనూ మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యంలో చాలా కంపెనీలు తక్కువ ధరకే 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా సామ్‌సంగ్ మార్కెట్లోకి మరో కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఎఫ్54 5జీ పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో సూపర్ ఫీచర్స్‌ను అందించనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో Exynos 1380 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే 25 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.





























