Nokia Phones: 4జీ సపోర్ట్‌తో రెండు నోకియా కీ ప్యాడ్ ఫోన్స్ రిలీజ్.. యూపీఐ పేమెంట్స్ సహా మరెన్నో ఫీచర్లు

నోకియా బ్రాండ్ లైసెన్సీ హెచ్ఎండీ గ్లోబల్ భారతదేశంలో రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. నోకియా 105 (2023), నోకియా 106 4 జీ పేరుతో  సాంప్రదాయ టీ9 కీప్యాడ్‌లతో ఈ ఫోన్లు ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి యూపీఐ 123 పే ఫంక్షనాలిటీతో వస్తుంది.

Nokia Phones: 4జీ సపోర్ట్‌తో రెండు నోకియా కీ ప్యాడ్ ఫోన్స్ రిలీజ్.. యూపీఐ పేమెంట్స్ సహా మరెన్నో ఫీచర్లు
Nokia
Follow us
Srinu

|

Updated on: May 19, 2023 | 5:30 PM

ఒకప్పుడు భారతదేశంలో నోకియా ఫోన్లే మార్కెట్‌ను శాసించేవి. అయితే క్రమేపి స్మార్ట్ ఫోన్ల రాకతో నోకియా వైభవం కనుమరుగైంది. నోకియా స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేసినప్పటికీ జనాధరణ పొందలేదు. దీంతో నోకియా బ్రాండ్‌ను విక్రయించింది. నోకియా బ్రాండ్ లైసెన్సీ హెచ్ఎండీ గ్లోబల్ భారతదేశంలో రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. నోకియా 105 (2023), నోకియా 106 4 జీ పేరుతో  సాంప్రదాయ టీ9 కీప్యాడ్‌లతో ఈ ఫోన్లు ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి యూపీఐ 123 పే ఫంక్షనాలిటీతో వస్తుంది. పేమెంట్ ఆప్షన్‌తో పాటు స్టాండర్డ్ యూసేజ్‌ అధిక రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు. ప్రస్తుతం భారతదేశంలో ఈ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. నోకియా 105 రూ.1299కు, నోకియా 106 4 జీ రూ.2,199కు కొనుగోలు చేయవచ్చు. నోకియా 105 చార్‌కోల్, సియాన్, రెడ్ కలర్ ఆప్షన్లతో వస్తుంది.  నోకియా 106 4 జీ చార్‌కోల్, బ్లూ వేరియంట్‌లలో  అందుబాటులో ఉంటుంది. 

నోకియా 105, 106 స్పెసిఫికేషన్లు

ఈ రెండు కొత్త నోకియా ఫోన్స్‌లో యూపీఐ 123 పే పేరుతో యాప్ ద్వారా సురక్షితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. వినియోగదారులు ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌కు కాల్ చేయడం, ఫీచర్ ఫోన్‌లలో యాప్ ద్వారా, మిస్డ్ కాల్ ఆధారిత విధానం, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. సహజంగానే ఈ ఫీచర్ పని చేయడానికి, వినియోగదారులు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ ఐడీను సృష్టించాలి. వినియోగదారులు యూపీఐ చెల్లింపులను సజావుగా చేయడంలో సహాయపడటానికి కంపెనీ గప్షప్‌తో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకుంది. నోకియా 106 4 జీ మెరుగైన రంగు పునరుత్పత్తితో ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. నోకియా 105లో అప్‌గ్రేడ్ చేసిన 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ గత మోడల్స్‌తో పోల్చుకుంటే 25 శాతం ఎక్కువ శక్తిని ఇస్తుంది. అలాగే నోకియా 106 4జీ 1450 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియోతో సహా ప్రామాణిక ఫీచర్ ఫోన్ సాధనాలతో లోడ్ చేశారు. నోకియా 106 4 జీలో అంతర్నిర్మిత ఎంపీ3 ప్లేయర్ కూడా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!