AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టి పొరల కింద దాగి ఉన్న 900 ఏళ్ల నాటి రహస్యం.. బయటపడ్డ అద్భుత ఆలయం..!

మట్టి పొరల కింద దాగి ఉన్న తొమ్మిది వందల ఏళ్ల నాటి రహస్యం ఇప్పుడు వెలుగు చూసింది! రాజస్థాన్‌లో ఒక అద్భుత నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. 11వ శతాబ్దం నాటి ఒక మహా దేవాలయం.. గుట్టల కింద నుంచి ప్రత్యక్షమైంది. అపురూపమైన విగ్రహాలు.. అబ్బురపరిచే కట్టడాలు.. అద్భుత నిర్మాణ శైలికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆ గుట్టల కింద ఇంకేం దాగి ఉంది? ఆ విగ్రహాలు చెబుతున్న చారిత్రక సత్యాలేంటి? అసలు ఆ కాలంలో అక్కడ ఏం జరిగింది? ఆ విగ్రహాలు ఏం చెబుతున్నాయి?

మట్టి పొరల కింద దాగి ఉన్న 900 ఏళ్ల నాటి రహస్యం.. బయటపడ్డ అద్భుత ఆలయం..!
Temple Discovered In Rajasthan
Balaraju Goud
|

Updated on: Feb 25, 2026 | 7:48 AM

Share

మట్టి పొరల కింద దాగి ఉన్న తొమ్మిది వందల ఏళ్ల నాటి రహస్యం ఇప్పుడు వెలుగు చూసింది! రాజస్థాన్‌లో ఒక అద్భుత నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. 11వ శతాబ్దం నాటి ఒక మహా దేవాలయం.. గుట్టల కింద నుంచి ప్రత్యక్షమైంది. అపురూపమైన విగ్రహాలు.. అబ్బురపరిచే కట్టడాలు.. అద్భుత నిర్మాణ శైలికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆ గుట్టల కింద ఇంకేం దాగి ఉంది? ఆ విగ్రహాలు చెబుతున్న చారిత్రక సత్యాలేంటి? అసలు ఆ కాలంలో అక్కడ ఏం జరిగింది? ఆ విగ్రహాలు ఏం చెబుతున్నాయి? అనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

రాజస్థాన్‌లోని ఖేతడి తహసీల్‌.. ఇప్పుడు చరిత్రకారుల సరికొత్త గమ్యస్థానంగా మారింది. త్యౌందా గ్రామంలోని మట్టి పొరల్లో దాగి ఉన్న రహస్యాలను ఛేదించేందుకు పురావస్తు శాఖ గత రెండు నెలలుగా నిశితంగా పరిశోధనలు చేస్తోంది. ఈ శాస్త్రీయ తవ్వకాల్లో సుమారు 900 ఏళ్ల కిందటి ఒక అద్భుత దేవాలయ పునాదులు, గోడల శిథిలాలు బయటపడ్డాయి. ఇక్కడ వెలుగు చూసిన కట్టడాలు 11, 12వ శతాబ్దాల కాలానికి చెందినవని పురావస్తు అధికారులు నిర్ధారించారు. ఆ కాలంలోనే ఈ ప్రాంతం అత్యున్నత నిర్మాణ శైలికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి కేంద్రంగా విరాజిల్లినట్టు ఈ శిథిలాలు సాక్ష్యమిస్తున్నాయి.

కేవలం రాతి కట్టడాలే కాకుండా.. ఇక్కడ లభించిన లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలు నాటి ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి. రాతితో చెక్కిన నేల, చతురస్రాకారపు పునాదులు, అరుదైన అర్ధ వృత్తాకార నిర్మాణ శైలి చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎర్రటి రాతి బ్లాకులు, ఇటుకలతో నిర్మించిన ఈ ఆలయ సముదాయం చూస్తే అప్పట్లో ఒక ఉన్నతమైన పట్టణ నాగరికత ఇక్కడ విలసిల్లిందనే సంకేతాలను ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం, ఈ నిర్మాణాలు ఆ కాలపు సామాజిక అభివృద్ధికి అద్దం పడుతున్నాయి.

ప్రస్తుతం 30 మంది స్థానిక కార్మికుల సాయంతో జరుగుతున్న ఈ అన్వేషణలో.. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. కేవలం ఆలయమే కాక, ఈ ప్రాంతంలో వేల ఏళ్లు ఓ సంస్కృతిక జీవనం కొనసాగిందనేందుకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. భూగర్భం నుంచి ప్రత్యక్షమవుతున్న ఈ ఆలయ ఆనవాళ్లు.. త్యౌందా గ్రామం చరిత్రను ప్రపంచ పటంలో మరో మెట్టు పైకి తీసుకెళ్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us