Samsung Fab Grab Fest: సామ్‌సంగ్ న్యూ సేల్ స్టార్ట్.. ఆ ఉత్పత్తులపై అదిరిపోయే డిస్కౌంట్స్..

తాజాగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ట్స్‌లో సమ్మర్ సేల్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ కూడా సరికొత్త సేల్‌తో మన ముందుకు వచ్చింది. సామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ పేరుతో తీసుకువచ్చిన ఈ సేల్‌లో సామ్‌సంగ్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి.

Samsung Fab Grab Fest: సామ్‌సంగ్ న్యూ సేల్ స్టార్ట్.. ఆ ఉత్పత్తులపై అదిరిపోయే డిస్కౌంట్స్..
Online
Follow us
Srinu

|

Updated on: May 10, 2023 | 4:00 PM

భారతదేశంలో సామ్‌సంగ్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ వేరు. మొదటి నుంచి సామ్‌సంగ్ ప్రొడెక్ట్స్‌కు ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది. మనం వాడే స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి ఇంట్లో వాడే గృహోపకరణాల వరకూ భారతదేశంలో సామ్‌సంగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం సామ్‌సంగ్ ఉత్పత్తులకు పోటీగా ఇతర ప్రొడెక్ట్స్ కూడా పోటీగా రావడంతో ఎప్పటికప్పుడు డిస్కౌంట్స్ సేల్స్‌తో మన ముందుకు వస్తుంది. తాజాగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ట్స్‌లో సమ్మర్ సేల్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ కూడా సరికొత్త సేల్‌తో మన ముందుకు వచ్చింది. సామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ పేరుతో తీసుకువచ్చిన ఈ సేల్‌లో సామ్‌సంగ్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌తో పాటు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, స్మార్ట్ వాచ్‌లు వంటి ఉత్పత్తులపై సామ్ సంగ్ డిస్కౌంట్స్ ప్రకటించింది. సామ్‌సంగ్ స్టోర్స్‌తో పాటు సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏయే ఉత్పత్తులపై ఎంత తగ్గింపు వస్తుందో? ఓ సారి చూద్దాం.

ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో గెలాక్సీ ఎస్ సిరీస్, ఏ సిరీస్, ఎం సీరిస్, ఎఫ్ సిరీస్, ఫ్లిప్3 వంటి ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై 57 శాతం వరకూ తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తుంది. అలాగే గెలాక్సీ ట్యాబ్‌లు, ఉపకరణాలు, అలాగే స్మార్ట్ వాచ్‌లపై 40 శాతం వరకూ తగ్గింపును అందిస్తుంది. ఫ్లాగ్ షిప్ నియో క్యూ ఎల్ఈడీ, ది ఫ్రేమ్ టీవీ, క్రిస్టల్ యూ హెచ్‌డీ టీవీలపై 45 శాతం తగ్గింపు లభిస్తుంది. సామ్‌సంగ్ రిఫ్రిజరేటర్లపై కూడా 40 శాతం డిస్కౌంట్ కంపెనీ అందిస్తుంది. అయితే వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 30 శాతం తగ్గింపుతో పాటు 28 లీటర్ల మైక్రో వేవ్ ఓవెన్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. అలాగే సామ్ సంగ్ ఏసీలపై కూడా కంపెనీ 40 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ సేల్‌లో రూ.25000 కంటే విలువైన ఉపకరణాలను ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 22.5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే సామ్‌సంగ్ విండ్ ఫ్రీ ఏసీలను అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..