Samsung: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. 13 ఎంపీ కెమెరా, భారీ స్క్రీన్‌.

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌లో భాగంగా పలు రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. హోం అప్లియెన్సెస్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌కు చెందిన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గేలాక్సీ ఎం4 స్మార్ట్‌ఫోన్‌ను..

Samsung: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. 13 ఎంపీ కెమెరా, భారీ స్క్రీన్‌.
Samsung Galaxy M04
Follow us

|

Updated on: May 07, 2023 | 2:28 PM

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌లో భాగంగా పలు రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. హోం అప్లియెన్సెస్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌కు చెందిన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గేలాక్సీ ఎం4 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 10,000కాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ. 6999కి కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఆఫర్‌ మే 8వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఇక సామ్‌సంగ్ గేలాక్సీ ఎం04 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్‌ని ఇచ్చారు. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 1.3+2 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో .సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. అమెజాన్ సేల్‌లో 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.6,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.7,999 ధరకు లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..