ISRO PSLV C55: శ్రీహరికోట PSLV C-55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. క్షణాల్లో నిప్పులు చిమ్ముకుంటూ రోదసిలోకి వెళ్లిన రాకెట్‌ విజయవంతం అయ్యింది. సుమారు 26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది..

ISRO PSLV C55: శ్రీహరికోట PSLV C-55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం
Pslv C55
Follow us

|

Updated on: Apr 22, 2023 | 4:08 PM

శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. క్షణాల్లో నిప్పులు చిమ్ముకుంటూ రోదసిలోకి వెళ్లిన రాకెట్‌ విజయవంతం అయ్యింది. సుమారు 26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

టెలియోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందినది కాగా.. దీనిని వివిధ ఏజెన్సీల అవసరాలకు వినియోగించనున్నారు. లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కలిసి అభివృద్ధి చేశాయి. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది.

పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఇది పూర్తిగా వాణిజ్యపరమైనది. త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య లాంటి అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు ఇస్రో చైర్మన్. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే.. ఇస్రో మరో రాకెట్‌ ప్రయోగించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు