Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Feature: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ నుంచి మరో అద్భుతమైన ఫీచర్‌.. ఇకపై ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు!

వాట్సాప్‌ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఉండదు. ఈ రోజుల్లో నిజ జీవితంలో వాట్సాప్‌ అనేది ఒక భాగంగా మారిపోయింది. ఎంతో మంది ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వినియోగదారుల కోసం వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది..

WhatsApp New Feature: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ నుంచి మరో అద్భుతమైన ఫీచర్‌.. ఇకపై ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు!
Whatsapp
Follow us
Subhash Goud

|

Updated on: Apr 21, 2023 | 6:24 PM

వాట్సాప్‌ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఉండదు. ఈ రోజుల్లో నిజ జీవితంలో వాట్సాప్‌ అనేది ఒక భాగంగా మారిపోయింది. ఎంతో మంది ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వినియోగదారుల కోసం వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది వాట్సాప్‌ సంస్థ. ఈ ఫీచర్‌ను మెసేజ్‌లను పంపిన వ్యక్తి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సంస్థ తెలిపింది.

వాట్సాప్ సందేశాలు అనవసరంగా ఇతరులకు చేరకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్‌లో ‘డిసప్పీయరింగ్ మెసేజెస్’ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం యూజర్లకు తెలిసిందే. ఈ ఆప్షన్‌ను ఆన్‌లో పెట్టుకున్న యూజర్లు.. తాము కోరుకుంటే అవసరమనుకున్న కొన్ని చాట్‌ మెసేజ్‌లను సేవ్ చేసుకునే అవకాశం ఈ కీప్‌ ఇన్‌ చాట్‌ ఫీచర్‌ కల్పిస్తుంది.

ఈ కొత్త ఫీచర్ యూజర్లను తమ చాట్‌లోని మెసేజ్‌లను సెట్ చేసిన తర్వాత ఆటోమాటిక్‌గా తొలగించేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ చాట్‌లపై మరింత కంట్రోల్ ఇస్తూ.. అదృశ్యమవుతున్న మెసేజ్ ఫీచర్ కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ కొత్త ఫీచర్ అప్‌డేట్ యూజర్లు తమ చాట్ హిస్టరీ నుంచి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ కాకుండా నిరోధించడంలో సాయపడుతుంది. దీని ద్వారా యూజర్‌లకు వారి చాట్‌లపై మరింత కంట్రోల్ పొందవచ్చు. వాట్సాప్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ (2.23.4.18) అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటాతో కొంతమంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మెసేజ్‌లు కనిపించకుండా ఉండే సామర్థ్యాన్ని ప్లాట్‌ఫారమ్ విడుదల చేస్తోంది.

ఈ ఫీచర్ అప్‌డేట్ అదృశ్యమవుతున్న చాట్ విండోలో కొత్త బుక్‌మార్క్ ఐకాన్ అందిస్తుంది. యూజర్లు తమ మెసేజ్ అటోమేటిక్‌గా డిలీట్‌ కాకుండా ఉంచాలనుకునే నిర్దిష్ట మెసేజ్‌లను ఎంచుకోవచ్చు. అంతేకాదు.. ఆయా మెసేజ్‌లను బుక్‌మార్క్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ మెసేజ్ అదృశ్యం కాకుండా మెసేజ్‌లను అలానే ఉంచే కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లను సేవ్ చేయాలనుకునే యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

Whatsapp New Features

Whatsapp New Features

కొత్త అప్‌డేట్‌ తర్వాత సమయ వ్యవధి పొడిగింపు..

ప్రస్తుతం, ప్లాట్‌ఫారమ్ మూడు ఆప్షన్ల నుంచి అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే.. అదృశ్యమయ్యే మెసేజ్‌ల కోసం వ్యవధిని సెట్ చేసేందుకు మాత్రమే యూజర్లను అనుమతిస్తుంది. అందులో 24 గంటలు, 7 రోజులు, 90 రోజులుగా ఉన్నాయి. అయితే, వాట్సాప్ త్వరలో ‘More Options’ మెను కింద అదృశ్యమయ్యే మెసేజ్‌ల కోసం 15 కొత్త సమయ వ్యవధి ఆప్షన్లను యాడ్ చేస్తోంది. అయితే కొత్త అప్‌డేట్‌ వచ్చిన తర్వాత 1 సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 12 గంటల నుంచి అదృశ్యమయ్యే మెసేజ్‌ల కోసం టైమర్‌ (6 గంటలు, 3 గంటలు, 1 గంట)ను సెటప్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి