- Telugu News Photo Gallery Business photos India's aviation sector recovering after Coronavirus, know how much Hyderabad Airport passenger traffic has improved Telugu News
Indian Aviation: కరోనా తర్వాత పుంజుకుంటోన్న భారత విమానయాన రంగం.. ఈ మూడు నెలల్లో ఎంత వృత్తి సాధించిందో తెలుసా.?
తాజాగా విమానయానం పట్ల మక్కువ పెరగడంతో టికెట్ రేట్లు అమాంతం పెరుగుతున్నా ప్రయాణికులు మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు.వ్యాపారంలో కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాలి .. ఎందుకంటే అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన భారత విమానయాన రంగం తిరిగి పుంజుకుంటోంది.
Updated on: Apr 21, 2023 | 7:26 PM


తాజాగా విమానయానం పట్ల మక్కువ పెరగడంతో టికెట్ రేట్లు అమాంతం పెరుగుతున్నా ప్రయాణికులు మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు.

వ్యాపారంలో కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాలి .. ఎందుకంటే అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన భారత విమానయాన రంగం తిరిగి పుంజుకుంటోంది.

భారతదేశానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్చి 2023 నెల దేశీయ ప్రయాణీకుల డేటాను విడుదల చేసింది.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పరిశ్రమ ఏకంగా 51.7 శాతం ప్రయాణికుల వృద్ధిని సాధించి, ఈ ఏడాదిలో 3.75 కోట్ల మంది ప్రయాణం చేశారని DGCA తెలిపింది.

డేటా ప్రకారం మార్చి 2023లోనే భారతదేశంలో దాదాపు 1.28 కోట్ల మంది ప్రయాణికులు దేశీయంగా ప్రయాణించారని, గతేడాది కంటే 20 శాతం ఎక్కువని దేశ విమానయాన పరిశ్రమ పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటన విడుదల చేసింది.

దీనికి కారణం ప్రయాణికుల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, నగరాల మధ్య ఎయిర్ కనెక్టవిటీ పెరగడం కారణమని ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 2.1 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహించారు. అంతక్రితం ఏడాది ప్రయాణించిన 1.24 కోట్ల మందితో పోలిస్తే ప్రయాణికుల రద్దీ 69 శాతం పెరిగిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది.

నెలవారీగా చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి కంటే 21.41 శాతం ప్రయాణికులు పెరిగారని రికార్డులు చెబుతున్నాయి. టైం , కంఫర్ట్ , కనెక్టవిటీ ఆధారంగా ట్రైన్ టికెట్స్ రేట్స్ కంపేర్ చేసుకుని ఎక్కువగా ఎయిర్ డొమెస్టిక్ ట్రావెలింగ్ పెరిగిందని ప్రయాణికులు అంటున్నారు.

అంతర్జాతీయ మరియు వ్యాపార ప్రయాణాలు పెరగడం, విమానాశ్రయ ఆపరేటర్ల సామర్థ్యం విస్తరణ మరియు విమానాల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల విమాన ప్రయాణీకుల రద్దీ వేగవంతమవుతుందని తాజా రికార్డ్స్ చెబుతున్నాయి.





























