- Telugu News Photo Gallery Business photos Here is the new electric car from MG, launching soon in Indian market, check details
MG Comet EV: నే వస్తున్నా కాస్కోండి అంటున్న ఎంజీ కామెట్.. ఈవీ కార్ లుక్, ఫీచర్స్‌పై ఓ లుక్కేద్దాం రండి..
ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. స్కూటర్లు, బైక్లు, కార్లు పెద్ద సంఖ్యలో లాంచ్ అవుతున్నాయి. నెలకు మూడు, నాలుగు కొత్త వాహనాలు పరిచయం అవుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ దారు ఎంజీ తన కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎంజీ కామెట్ పేరుతో వస్తున్న ఈ చిన్న కారును మన దేశంలోనే తయారు చేసి లాంచ్ చేస్తోంది. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 21, 2023 | 4:30 PM

ఎంజీ కంపెనీ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. మొదటిది జెడ్ఎస్ ఈవీ కాగా, రెండోది ఈ ఎంజీ కామెట్.

ఈ కారుకు రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. నలుగురు కూర్చొనే వీలుంటుంది. దీని ఎత్తు 1.63 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, పొడవు సుమారు మూడు మీటర్లు ఉంటుంది.

జెడ్ఎస్ కారుతో పోల్చుకుంటే ఈ కామెట్ ఈవీ కారు పూర్తి కాంట్రాస్ట్ లో ఉంటుంది. ముఖ్యంగా సిటీ అవసరాలకు మాత్రమే ఉద్దేశించి ఈకారును రూపొందించారు. చూడటానికి కూడా చిన్నగాక్యూట్ గా ఉంటుంది.

ఈ కామెట్ ఈవీ కారు ధరను కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ కొన్ని అంచనాల ప్రకారం దీని ధర రూ. 10లక్షల నుంచి రూ. 15లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల తర్వాత దీని ధరను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

1.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇప్పటికే గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. టాటా మోటార్స్ `టియాగో ఈవీ`కి `కొమెట్ ఈవీ` గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారులోని 20 కిలోవాట్ అవర్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది.




