- Telugu News Photo Gallery Business photos Upcoming SUVs in 2023 for India, check here for the list of new cars
Upcoming SUVs: భారత మార్కెట్‌లోకి దూసుకొస్తున్న ఎస్‌యూవీలు.. ఈ ఏడాదిలో రాబోయే అద్భుతమైన కార్లు ఇవే..
దేశంలో రోజురోజుకి ఎస్‌యూవీల హవా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే పలు దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఎస్‌యూవీలను, పాత వెర్షన్లకు నవీకరణలు చేసి త్వరలో విడుదల చేయాలని చూస్తున్నాయి. అలా ఈ ఏడాదిలో ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న టాప్ 5 ఎస్‌యూవీల వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 22, 2023 | 7:05 AM

Citroen C3 Aircross: సిట్రొయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కార్ ఈ ఏప్రిల్ నెలలోనే దాని గ్లోబల్ ప్రీమియర్‌ను తీసుకురాబోతుంది. అదే సమయంలో ఇండియన్ మార్కెట్‌లో ఈ కొత్త ఎస్‌యూవీ కార్ విక్రయాలు 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇక ఈ కార్ 5 సీటర్, 7 సీటర్ ఎంపికలలో రాబోతుంది.

Honda Midsize SUV: హోండా కంపెనీ కూడా తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఇండియన్ మార్కెట్‌లోకి రాబోయే 5 సీటర్ SUVని జూలై లేదా ఆగస్టులో విడుదల చేయవచ్చు. దీని డిజైన్ హోండా గ్లోబల్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది.

Kia Seltos Facelift: కియా సెల్టోస్ నుంచి రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కోసం చాలా మంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. రాబోయే మోడల్‌ను కియా సెల్టోస్ కొత్త అప్‌డేట్‌లతో ప్రజలకు పరిచయం చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలో ఒకటిగా ఉంది.

Tata Safari Facelift: ఈ సంవత్సరం టాటా మోటార్స్ సఫారి ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. టాటా సఫారీ భారతదేశంలో చాలా కాలంగా ఇష్టపడుతోన్న ఎస్‌యూవీ. ఈ క్రమంలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చిన తర్వాత దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Tata Harrier Facelift: టాటా హ్యారియర్ ఆప్‌డేటెడ్ మోడల్ కూడా అతి త్వరలో విడుదల కానుంది. అనేక అప్‌డేట్‌లతో విడుదల చేసే కార్‌తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి టాటా కంపెనీ సన్నాహాలు చేస్తోంది.





























