- Telugu News Photo Gallery Business photos Akshaya Tritiya 2023: Why Akshaya Tritiya is celebrated?.. Is it good to buy gold on Akshaya Tritiya?
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ అంటే ఏమిటి..?.. ఆ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు..?
అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా..
Updated on: Apr 20, 2023 | 2:34 PM

అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు.

ఈరోజున ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని, ఎన్నటికీ నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే ఇవాళ విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారం కొంటూ ఉంటారు. కొంతమంది ఈరోజున వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలానే మరొక నమ్మకం కూడా ఉంది.

శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తాం.

ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయనీ, భగవంతునికి ఏది సమర్పించినా రెండింతలై మనకి తిరిగి వస్తుందని అందరూ నమ్ముతారు. అందుకే,కొద్దిగానైనా సరే బంగారం కొని భగవంతునికి సమర్పిస్తారు.

ప్రపంచంలో మనకి ఏదైనా ఇవ్వగల భగవంతుడి దగ్గరకు వెళ్లి డబ్బు, బంగారం అడగడం ఎంతవరకూ సబబు? ఆయన దగ్గర మనం కోరవలసింది అపారమైన జ్ఞానం. ఈ విశ్వంలో ఉన్న అమితమైన జ్ఞానసంపదను మనం కొల్లగొట్టగలిగితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అక్షయ తృతీయ నాడు ఆ దేవదేవుడికి మనం సమర్పించగలిగినది సమర్పించి జీవితానికి ఒక పరమార్ధం కల్పించమని కోరుకుందాం.





























