Air Coolers: మీరు కూలర్లను కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూలర్లు దర్శనమిస్తుంటాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే కూలర్లు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. వాటిని గమనించే కొనుగోలు చేయాలి. అయితే కూలర్లలో ఈ రెండు రకాలుంటాయి..

Air Coolers: మీరు కూలర్లను కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
Air Coolers
Follow us
Subhash Goud

|

Updated on: Apr 20, 2023 | 5:21 PM

ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూలర్లు దర్శనమిస్తుంటాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే కూలర్లు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. వాటిని గమనించే కొనుగోలు చేయాలి. అయితే కూలర్లలో ఈ రెండు రకాలుంటాయి. రూమ్‌ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 200-300sft లో మీరుండే గది ఉంటే పర్సనల్‌ కూలర్‌ సరిపోతుంది. అంతకుమించి రూమ్‌ సైజు ఉంటే కనుక డిసర్ట్‌ కూలర్‌ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

  1. వాటర్‌ ట్యాంక్‌ కెపాసిటి: కూలర్‌ కొనుగోలు చేసే ముందు వాటర్‌ ట్యాంక్‌ కెపాసిజిని గమనించాలి. మీరుండే గది చిన్నదైతే 15-25లీటర్లు, కాస్త పెద్ద గది ఉన్నట్లయితే 25-40లీటర్లు, ఇంకా పెద్దదైతే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్‌ ట్యాంక్‌ కెపాసిటీ ఉన్న కూలర్‌ ని తీసుకోవడం మంచిది.
  2. వాతావరణం బట్టి కూలర్లు.. ఇక పొడి వాతావరణంలో అయితే డిసర్ట్‌ కూలర్స్‌ బాగా పనిచేస్తాయి. అలాగే తేమ వాతావరణంలో అంటే తీర ప్రాంతాల్లో నివసించే వాళ్లు పర్సనల్‌, టవర్‌ కూలర్లు తీసుకోవడం ఉత్తమం.
  3. కూలర్‌ ఆన్‌ చేయగానే వచ్చే సౌండ్‌: కూలర్ కొనేముందు నాయిస్ లెవెల్ అంటే కూలర్ ఆన్ చేసినప్పుడు ఎంత సౌండ్ వస్తుందన్నది చెక్ చేసుకోవడం మంచిది. కొన్ని కూలర్లను ఆన్‌ చేయగానే చాలా సౌండ్‌ వస్తుంటుంది. మరికొన్ని కూలర్లు తక్కువ సౌండ్‌తో ఉంటాయి. మీరు షోరూమ్‌లో కొనుగోలు చేసే ముందు దీనిని కూడా చెక్‌ చేసుకోవాలి.
  4. ఆటో ఫిల్‌ ఆప్షన్‌: కూలర్లలో ఆటో ఫిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. నీళ్లు ఖాళీ కాగానే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల కూలర్‌ మోటార్‌ చెడిపోకుండా ఉంటుంది.
  5. కూలింగ్‌ ప్యాడ్స్: ఎయిర్ కూలర్‌కు కూలింగ్ ప్యాడ్స్ కూడా చాలా ముఖ్యం. ఇందులో వివిధ రకాల ప్యాడ్స్‌ ఉంటాయి. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ వంటి రకాలుంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూలింగ్‌ నిస్తుంది. మెయింటనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
  6. కూలర్లలో అదనపు ఫీచర్స్‌: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. కూలర్లలో చాలా రకాల ఫీచర్స్‌ ఉంటున్నాయి. రిమోట్‌ కంట్రోల్‌, యాంటీ మస్కిటో ఫిల్టర్‌, డస్ట్‌ ఫిల్టర్‌ లాంటి అదనపు ఫీచర్లను జోడిస్తూ కూలర్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. అలాంటి ఫీచర్స్‌ ఉన్న కూలర్ల గురించి ఆరా తీసి తీసుకోండి.
  7. ఐస్‌ ఛాంబర్‌: కొన్ని కూలర్లలో ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే ట్యాంక్ త్వరగా కూల్ అవుతుంది.
  8. పవర్‌ యూసేజ్‌: కూలర్‌ వేసినప్పుడు ఎన్ని పవర్‌ యూనిట్లు అవుతుందన్నది తెలుసుకోవడం ముఖ్యం. స్టార్‌ రేటింగ్స్‌ ని చూసి ఎంపిక చేసుకోండి. అలాగే ఈమధ్యన ఇన్వర్టర్‌ టెక్నాలజీతో కూలర్లు వస్తున్నాయి. వీటి వల్ల కూడా పవర్‌ సేవ్‌ అవుతుంది. కరెంట్ పోయినా కూలర్ కొద్ది సేపు పనిచేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!