Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. మూడు రోజుల పాటు బ్యాంకులకు తాళాలు.. పనుంటే ముందే చేసుకోండి..

అయితే కొన్ని బ్యాంకింగ్ రీజియన్లలో ఏప్రిల్ 21 అంటే శుక్రవారాన్ని రంజాన్ సెలవుగా తీసుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి. శుక్రవారం రంజాన్, తర్వాత నాలుగో శనివారం, తర్వాత ఆదివారం. మళ్లీ శనివారం బ్యాంకులను తెరుస్తారు.

Bank Holidays: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. మూడు రోజుల పాటు బ్యాంకులకు తాళాలు.. పనుంటే ముందే చేసుకోండి..
Bank Holidays
Follow us
Madhu

|

Updated on: Apr 20, 2023 | 6:30 PM

ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ సమీపించింది. కనిపించే నెలవంకను బట్టి ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22వ తేదీన పండుగ జరుపుకుంటారు. అయితే బ్యాంకులకు మాత్రం ఏప్రిల్ 22న రంజాన్ సెలవుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. అంటే అది నాలుగో శనివారం. ఇది సాధారణంగానే సెలవు దినం. అయితే కొన్ని బ్యాంకింగ్ రీజియన్లలో ఏప్రిల్ 21 అంటే శుక్రవారాన్ని రంజాన్ సెలవుగా తీసుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి. శుక్రవారం రంజాన్, తర్వాత నాలుగో శనివారం, తర్వాత ఆదివారం.

రెండు కేటగిరీలు..

బ్యాంకులకు సెలవులను రెండు కేటగిరీలుగా ఇస్తారు. నేషనల్ హాలిడేస్, అలాగే ప్రభుత్వ సెలవుదినాలు. నేషనల్ హాలిడేస్ అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, మహాత్మగాంధీ వంటి పండుగలకు దేశంలోని అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి. ప్రభుత్వ సెలవు దినాలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సెలవులు అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సెలవులు దేశ వ్యాప్తంగా అమలవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సెలవులు ఆ రాష్ట్రానికే పరిమితం అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ సెలవులకు ఉదాహరణ చెప్పాలంటే మహారాష్ట్ర డే రోజు మహారాష్ట్రలో సెలవు, అలాగే గోవా లిబరేషన్ డే రోజు గోవాలో, హరియాణా డే రోజున హరియాణాలో సెలవు ఉంటాయి. ఈ నేషనల్, ప్రభుత్వ సెలవు దినాలు కాక ప్రతి రెండో, నాలుగో శనివారం, ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవులే.

ఏప్రిల్ లో 15 సెలవులు.. 2023 ఏప్రిల్ మాసంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వీకెండ్లతో కలిపి మొత్తం మీద 15 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఇవి ఆర్బీఐ సూచనల ప్రకారం జరిగింది.

ఇవి కూడా చదవండి

రంజాన్ సెలవు ఎప్పుడంటే..

ఆర్బీఐ ఆఫీషియల్ క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21 శుక్రవారం లేదా ఏప్రిల్ 22 శనివారంలలో ఒక్క రోజే సెలవు తీసుకోవాలి. అయితే అగర్తలా, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలలో ఏప్రిల్ 21న రంజాన్ సెలవుంటుంది. అలాగే బెలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, ఇంపాల్, జైపూర్, కాన్పూర్, కోల్ కతా, లక్నో, ముంబై, నాగ్ పూర్, న్యూ ఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్ పూర్, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్ లలో ఏప్రిల్ 21 అలాగే ఏప్రిల్ 22 రెండు రోజులు బ్యాంకులకు సెలవులు. మీకు ఆరోజుల్లో బ్యాంకుతో పని ఉంటే ముందుగా చేసుకోవడమే లేక తర్వాతకు వాయిదా వేసుకోవడం చేయడం ఉత్తమం. దీనిని కన్ఫర్మ్ చేసుకోడానికి లోకల్ బ్రాంచ్ లో సెలవు షెడ్యూల్ ను చెక్ చేసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్