Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF News: పీపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన నిర్మలమ్మ.. ఆ ఛార్జీల నుంచి మినహాయింపు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. అలాగే సాధారణ పౌరులకు పొదుపుపై ఆసక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే తాజాగా పీపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు.

PPF News: పీపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన నిర్మలమ్మ.. ఆ ఛార్జీల నుంచి మినహాయింపు
Ppf Nomination
Follow us
Srinu

|

Updated on: Apr 04, 2025 | 1:56 PM

పీపీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం కలిగించే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలను జోడించడానికి లేదా అప్‌డేట్ చేయడానికి ఎలాంటి రుసుము వసూలు చేయమని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.  పీపీఎఫ్ ఖాతాలకు నామినీల అప్‌డేట్‌పై ఏవైనా ఛార్జీలను తొలగించడానికి 02/4/25 గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018 లో అవసరమైన మార్పులు చేశామని స్పష్టం చేశారు. పీపీఎఫ్ ఖాతాల్లో నామినీ వివరాలను సవరించినందుకు ఆర్థిక సంస్థలు కస్టమర్ల నుండి వసూలు చేస్తున్నట్లు ఇటీవల తనకు సమాచారం అందిందని సీతారామన్ పేర్కొన్నారు. అందువల్ల దీనిని పరిష్కరించడానికి, నామినీ వివరాలను నవీకరించడానికి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 

పీపీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సందర్భంలో డబ్బు సజావుగా బదిలీ చేయడానికి పీపీఎఫ్ ఖాతాకు నామినీని జోడించడం ముఖ్యం. దీనివల్ల సరైన వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొదుపు డబ్బు అందుతుంది. గతంలో నామినీని నవీకరించడానికి లేదా తొలగించడానికి కస్టమర్లు రూ. 50 చెల్లించాల్సి ఉండేది. అలాగే ఇటీవల ఆమోదించిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ఇప్పుడు వ్యక్తులు తమ డిపాజిట్లు, సేఫ్ కస్టడీ ఆర్టికల్స్, సేఫ్టీ లాకర్ల కోసం నలుగురి వరకు నామినేట్ చేయడానికి అనుమతిస్తుంది. 

పీపీఎఫ్ ఖాతా అంటే ఏమిటి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతు ఇచ్చే దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇది ఈఈఈ (మినహాయింపు-మినహాయింపు- మినహాయింపు) వర్గంలోకి వస్తుంది. అంటే పెట్టుబడి, వడ్డీ మొత్తం, పరిపక్వత సమయంలో మొత్తం అన్నీ పన్ను మినహాయింపు పొందుతాయి. దీనికి 15 సంవత్సరాల కాలపరిమితి ఉంది. దీనిని ఐదు సంవత్సరాల బ్లాక్లుగా పొడిగించవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వార్షిక వడ్డీ రేటు 7.1% వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..