రెచ్చిపోయిన ట్రంప్.. సుంకాల మోతతో ప్రపంచమంతటా.. జింతాత జితాజితా!
అమెరికా దిగుమతులపై మీరు సుంకాలు తగ్గిస్తే మేం కూడా తగ్గిస్తాం అని బంపరాఫర్ ఇవ్వడం ద్వారా కొత్త మైండ్‌గేమ్ షురూ చేశారు అమెరికన్ ప్రెసిడెంట్. సుంకం పెంపు అనేది మీరనుకుంటున్నట్టు పనిష్మెంట్ కాదు.. బెనిఫిట్ అంటూ కన్ను గీటుతోంది అమెరికా. కానీ.. విదేశీ మార్కెట్ల మధ్య పోటీతత్వం పెంచి.. తమ దేశంలో వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చడం అమెరికన్ ప్రెసిడెంట్ కుయుక్తి. దీంతో ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా భారీ మూల్యం చెల్లించుకోబోయేది మనమేనా..?

మమ్మల్ని సుంకాలతో బాదారు కనుక.. మమ్మల్ని బికార్లుగా మార్చాలని చూశారు కనుక.. మా దేశపు వాణిజ్యంతో ఇన్నాళ్లూ ఆడుకున్నారు కనుక.. ఇప్పుడు మా వంతొచ్చింది. ఆటాడుకోవడం మొదలుపెడితే మా కంటే ఎవ్వడూ బాగా ఆడలేడు.. అని అమెరికా పెద్ద కుర్చీ ఎక్కీఎక్కగానే ప్రతీకార విషం కక్కేశారు డొనాల్డ్ ట్రంప్. తమ దేశానికి ఎగుమతయ్యే విదేశీ వస్తువుల మీద సుంకాల బెత్తంతో బాదేశారు. ఇంతకింతా అనుభవించండి అంటూ ప్రపంచ దేశాలన్నిటికీ పెద్ద రిటర్న్ గిఫ్టే ఇచ్చిపడేశారు డొనాల్డ్ ట్రంప్. దోస్త్ మేరా దోస్త్.. మోదీ మేరా జిగ్రీ దోస్త్ అంటూనే భారత్ కు చుక్కలు చూపిస్తున్నారు అమెరికా అధ్యక్షులు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని తన టైపాఫ్ యాపారం మొదలుపెట్టేశారు. నేరుగా భారత వాణిజ్యానికే ఎసరు పెట్టేశారు. మోదీ నాకు స్నేహితుడే.. కానీ, అమెరికాతో భారత్ వ్యవహారమే సరిగ్గా లేదు. పైగా. వాణిజ్యంలో శత్రువు కంటే స్నేహితుడు ప్రమాదకరం అంటూ సూక్తులు చెబుతున్నారు. టోటల్‌గా ట్రంప్ మోగించిన 26 శాతం సుంకాల మోత.. భారత్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌ని ఓ రేంజ్‌లో డిస్టర్బ్ చెయ్యబోతోందంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా ఫస్ట్.. మిగతా దేశాలన్నీ నెక్స్ట్ అని సెకండ్ టర్మ్‌లో స్లోగన్ ఎత్తుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఆ థియరీల్ని ఇప్పుడిప్పుడే ఘాటుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విదేశీ దిగుమతులపై 49శాతం వరకు సుంకాలు విధిస్తూ.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య వర్గాలను ఎటెన్షన్ మోడ్‌లోకి తెచ్చింది. మా ఉత్పత్తులను...