Viral: మహిళ వేషంలో చెత్తకుప్పలో గోనె సంచులు విసిరేసిన అజ్ఞాత వ్యక్తి.. ఏముందా అని చూడగా
స్నేహం అనే ముసుగులో మిత్రుడ్ని ఖండఖండాలుగా నరికాడు. డెడ్‌బాడీని ఒకేచోట పడేస్తే దొరికిపోతానన్న అనుమానంతో.. శరీర భాగాలను వేరు చేసి.. వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఖాకీలకు చిక్కకుండా క్రైమ్ కహానీని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాడు. బట్.. గుజరాత్ పోలీసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాక మ్యాటర్ మారింది. మిత్రద్రోహి కథ కటకటాలకు చేరింది. ఇంతకీ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు?

ఊహించని ఘటన.. ఉలిక్కిపడ్డారంతా. ఆనోటా ఈనోటా మ్యాటర్ పోలీసుల చెవిన పడింది. అసలేం జరిగింది..? ఆరా తీస్తుండగానే మూడు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో శరీర భాగాలు దొరికాయి. హతుడెవరు..? హంతకుడెవరు..? మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తలోదిక్కున పడేస్తున్నదెవరు? అన్ని కోణాల్లో కూపీ లాగే క్రమంలో.. మృతుడి చేతిపై టాటూ గుర్తించారు పోలీసులు. దాని ఆధారంగా తీగలాగితే.. డొంక కదిలింది.
సచిన్ చౌహన్.. ప్రాపర్ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్. అతను భారుచ్‌లోని దహేజ్‌లో పనిచేసేవాడు. అక్కడే సచిన్‌కు శైలేంద్ర చౌహన్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ.. ఒక్క విషయంతో శైలేంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట శైలేంద్ర నీళ్లు నమిలాడు. ఏవేవో చెప్పి బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమదైన స్టయిల్ విచారించగా క్రైమ్ చిత్రాన్ని సీన్ టు సీన్ రివీల్ చేశాడు శైలేంద్ర.
సచిన్ అతని భార్య వ్యక్తిగత ఫోటోలు దొంగిలించాడు శైలేంద్ర చౌహన్. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం.. గొడవలు జరుగుతుండేవి. మార్చి 24న ఇద్దరు కలిసి మద్యం తాగారు. అ సమయంలో కూడా మళ్లీ వివాదం నడిచింది. కోపంతో ఊగిపోయిన శైలేంద్ర.. సచిన్‌పై దాడి చేసి హతమార్చాడు. అయితే మృతదేహాన్ని వెంటనే పడేయకుండా.. మూడు రోజుల పాటు ఇంట్లోనే దాచి పెట్టాడు. తొమ్మిది పార్ట్‌లుగా డెడ్‌బాడీని కత్తితో నరికి.. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు.
మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ఎక్కడెక్కడో పడేయడంతోనే అయిపోలేదు. ఆ తర్వాత సీన్‌ని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు శైలేంద్ర చౌహన్. సచిన్ ఫోన్ తీసుకుని బిజ్నోర్, ఢిల్లీ వెళ్లి అతని కుటుంబసభ్యులకి మెసేజ్‌లు పంపించాడు. సచిన్ ఇంకా బతికే ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. అలాగే సచిన్ ఏటీఎం కార్డ్‌ను రైల్లో వదిలేశాడు. అది వేరే వాళ్లు వాడితే తనపై అనుమానం రాకుండా ఉంటుందని జాగ్రత్తపడ్డాడు. మహిళగా గౌన్ ధరించి స్కూటర్‌పై చాలా దూరం ప్రయాణించి శరీర భాగాలను పడేశాడు. ఇవన్నీ పోలీసుల విచారణలో బయటపెట్టాడు శైలేంద్ర. ఒక మనిషిని చంపడమే కాకుండా మూడు రోజుల పాటు శవంతో జాగారం చేసి దాన్ని ఎక్కడికక్కడ నరకడం విని ఖాకీలు షాకయ్యారు.
వ్యక్తిగత ఫోటోలు బయటికెళ్తే ఎంత ప్రమాదం? దాని వల్ల జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టిందీ స్టోరీ. పోలీసులు చాకచాక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. లేదంటే శైలేంద్ర ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చేసేవాడో. ఎవరు తప్పు చేసినా బ్లాక్‌మెయిల్ చేసినా వెంటనే ధైర్యంగా తమను ఆశ్రయించాలంటున్నారు పోలీసులు. లేదంటే నష్టపోయేది మీరేనని గుర్తించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
