IPL 2025: కొత్త వివాదంలో చిక్కుకున్న రోహిత్ శర్మ! సంచలన వీడియో బయటపెట్టిన ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ జహీర్ ఖాన్ తో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించబడిన తర్వాత, రోహిత్ తన పాత్రను సరిగ్గా నిర్వహించాడని, ఇక చేయాల్సిన అవసరం లేదని జహీర్ తో చెప్పాడు.

టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న క్రమంలో రోహిత్ శర్మ, లక్నో మెంటర్ జహీర్ ఖాన్‌తో పర్సనల్ విషయాలు మాట్లాడుకున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోను ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. నిజానికి ఆ వీడియోలో రిషభ్ పంత్, రోహిత్ శర్మను వెళ్లి హగ్ చేసుకోవడం, వాళ్ల బాండింగ్ చూపించే విధంగా ఉన్నప్పటికీ.. పంత్ వచ్చే ముందు రోహిత్ శర్మ, జహీర్ ఖాన్‌తో చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. “ జో జబ్ కర్ణా థా మైనే కియా బరాబర్ సే, అబ్ మేరేకో కుచ్ కర్నే కి జరూరత్ నహీ హై (అప్పుడు నేను చేయాల్సింది, సరిగ్గా చేశాను, ఇప్పుడు నేను ఏమీ చేయనవసరం లేదు)” అని రోహిత్, జహీర్‌తో చెబుతున్నాడు.
ఇక్కడ రోహిత్ మాట్లాడిన ఈ మాటలు ముంబై ఇండియన్స్ గురించే అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. గతేడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి, అతని ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యాను నియమించింది ముంబై మేనేజ్మెంట్. ఆ సమయంలో రోహిత్ శర్మ చాలా హర్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ముంబై టీమ్ నుంచి బయటికి కూడా వచ్చేస్తాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ, అలా జరగలేదు. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ ఆగ్రహంగా ఉన్నట్లు ఇప్పటి అతని మాటలు బట్టి అర్థం అవుతుంది. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో ముంబై టీమ్ కోసం ఏం చేయాలో అది సరిగ్గా చేశానని, ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదని రోహిత్ చెబుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఫేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. ముంబై ఇలా డౌన్ ఫాల్‌లోకి వెళ్తున్నా.. నువ్వెందుకు ఏం చేయడం లేదని జహీర్ ప్రశ్నించడంతో రోహిత్ అలా రియాక్ట్ అయి ఉండాలని అంతా అనుకుంటున్నారు. గతంలో జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా, బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, రోహిత్ వీడియో వైరల్ కావడంతో కొంతమంది రోహిత్ మరీ ఇంత స్వార్థపరుడా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Q: For how long are you going to watch this reel? 😍
A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2
— Mumbai Indians (@mipaltan) April 3, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..