Video: ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు! రెండు చేతులతో బౌలింగ్ చేసిన SRH యంగ్ ప్లేయర్..
SRH vs KKR మ్యాచ్‌లో కమిండు మెండిస్ తన ద్వంద్వ బౌలింగ్ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసి, KKR బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ వికెట్‌ను తీసి స్పెషల్ మార్క్ సాధించాడు. SRH బౌలర్లు మంచి ప్రయత్నం చేసినా, KKR చివరి ఓవర్లలో విరుచుకుపడి భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్‌లో అరుదైన ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

కమిండు మెండిస్ క్రికెట్‌లో అరుదైన ఆటగాడు. శ్రీలంకకు చెందిన ఈ ఆల్‌రౌండర్ రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగలడు. IPL 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌లో అతని ప్రతిభ మరోసారి కనిపించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్లో ఎడమచేతితోనూ, కుడిచేతితోనూ బౌలింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు.
కమిండు మెండిస్ తన ఐపీఎల్ డెబ్యూట్ మ్యాచ్‌లోనే KKR బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ వికెట్‌ను తీయడం విశేషం. ఇది అతనికి మొదటి మ్యాచ్ అయినప్పటికీ, అతను ఇప్పటికే శ్రీలంక తరఫున 12 టెస్టులు, 19 వన్డేలు, 23 T20I మ్యాచ్‌లు ఆడాడు. అతని అరుదైన బౌలింగ్ నైపుణ్యాన్ని చూసిన తర్వాత, IPL అధికారిక X (ట్విట్టర్) ఖాతా “గందరగోళంగా ఉందా?” అంటూ సరదాగా స్పందించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో జరిగిన 15వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ SRHతో భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో KKR 20 ఓవర్లలో 200/6 స్కోరు చేసింది.
తొలి మూడు ఓవర్లలోనే KKR 17/2కి కుప్పకూలింది. ఓపెనర్లు సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ ఫెయిల్ కావడంతో, జట్టు ఒత్తిడిలో పడింది. డి కాక్ 6 బంతుల్లో కేవలం 1 పరుగే చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సునీల్ నరైన్ 7 బంతుల్లో 7 పరుగులకే మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు.
ఈ దశలో కెప్టెన్ అజింక్య రహానే, యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ సంయమనంతో ఆడి, స్మార్ట్ షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రహానే 38 (27 బంతులు, 3 సిక్సర్లు) పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
రఘువంశీ మాత్రం నిలకడగా ఆడి 30 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, కమిండు మెండిస్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆఫ్స్‌పిన్‌ను డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోకి స్లైస్ చేయడంతో అతని ఇన్నింగ్స్ 50 పరుగులకు (32 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ముగిసింది.
SRH బౌలింగ్ దాడిలో పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ మంచి బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినా, చివరి ఓవర్లలో వాళ్లను KKR బ్యాటర్లు ఊపిరిపీల్చనీయకుండా చేశారు. కానీ, కమిండు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Left 👉 Right Right 👉 LeftConfused? 🤔
That's what Kamindu Mendis causes in the minds of batters 😉
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @SunRisers pic.twitter.com/IJH0N1c3kT
— IndianPremierLeague (@IPL) April 3, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



