Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Pulsar: బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!

Bajaj Pulsar: బజాజ్‌ పల్సర్‌ బైక్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ బైక్‌ను యువత ఎంతగానో ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఈ బైక్‌పై వెయ్యి రూపాయల నుంచి రూ.7 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది కంపెనీ. బజాజ్ ఆటో 50కి పైగా దేశాలలో 2 కోట్లకు పైగా యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

Bajaj Pulsar: బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..  బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 03, 2025 | 9:22 PM

బజాజ్ ఆటో 50కి పైగా దేశాలలో 2 కోట్లకు పైగా యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. దీనిని పురస్కరించుకుని కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కూడా కొత్త పల్సర్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, బజాజ్ కంపెనీ చౌకగా కొత్త బైక్ కొనడానికి గొప్ప అవకాశం ఉంది. దీని కోసం కంపెనీ రూ.7379 తగ్గింపును అందిస్తోంది. ఈ పరిమిత ఆఫర్ ప్రయోజనం పల్సర్ 125 నియాన్, పల్సర్ 150, 125 కార్బన్ ఫైబర్, N160 USD, 220F మోడళ్లపై అందిస్తోంది. ఏ మోడల్ పై మీరు ఎంత డబ్బు ఆదా చేయవచ్చో చూద్దాం..

బజాజ్ బైక్‌లపై డిస్కౌంట్ ప్రయోజనం:

  • పల్సర్ 125 నియాన్ కొనుగోలుపై రూ.1184 ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ బైక్ ధర రూ.84,493 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
  • బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ మోడల్ కొనుగోలు చేయడం ద్వారా మీరు రూ. 2,000 ఆదా చేసుకోవచ్చు. ఈ బైక్ ధర రూ. 91,610 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
  • బజాజ్ పల్సర్ 150 సింగిల్ డిస్క్, ట్విన్ డిస్క్ వేరియంట్లపై రూ.3,000 తగ్గింపు అందిస్తోంది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,12,838 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అలాగే ట్విన్ డిస్క్ మోడల్ ధర రూ.1,19,923 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.
  • బజాజ్ పల్సర్ N160 USD మోడల్‌పై కంపెనీ రూ. 5811 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 1,36,992 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఖర్చు చేయాలి.
  • పల్సర్ 220F వేరియంట్‌పై అత్యధిక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ బైక్‌పై కంపెనీ రూ. 7379 తగ్గింపును అందిస్తోంది. అయితే మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ డీల్ ప్రయోజనాన్ని పొందుతారు.

భారతదేశంలో పల్సర్ ప్రయాణం

ఇవి కూడా చదవండి

బజాజ్ ఆటో మొదటిసారిగా పల్సర్ బైక్‌ను 2001లో విడుదల చేసింది. కంపెనీ 1 కోటి అమ్మకాల మార్కును దాటడానికి 17 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కంపెనీ తదుపరి 1 కోటి మార్కును కేవలం 6 సంవత్సరాలలోనే దాటింది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో మీకు లోయర్ బెర్త్ కావాలా? ఇలా చేస్తే సీటు కన్ఫర్మ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి