Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart TV Lifespan: స్మార్ట్ టీవీకి గడువు తేదీ ఉంటుందా? దాని జీవిత కాలం ఎంత?

Smart TV Lifespan: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్‌ టీవీ ఉంటుంది. ఒకప్పుడు పెద్ద టీవీలు ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్ది ప్రతి ఇంట్లో స్మార్ట్‌ టీవీలు దర్శనమిస్తున్నాయి. అయితే స్మార్ట్‌ టీవీకి గడువు తేదీ ఉంటుందా? దాని జీవిత కాలం ఎంత? అని మీరెప్పుడైనా ఆలోచించారా? దాని గుర్తించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Smart TV Lifespan: స్మార్ట్ టీవీకి గడువు తేదీ ఉంటుందా? దాని జీవిత కాలం ఎంత?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 03, 2025 | 5:14 PM

స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే స్మార్ట్ టీవీలు నేడు ప్రతి ఇంట్లో తప్పనిసరి అయిపోయాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అధునాతన సాంకేతికతతో కూడిన టీవీలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ స్మార్ట్ టీవీ జీవితకాలం ఎంత ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం టీవీ జీవితకాలం ఎంత ? టీవీ కొన్న ఎన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మార్చాలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

LED TV జీవితకాలం ఈ విషయాలపై ఆధారపడి ఉంటుంది:

TV జీవితకాలం వినియోగం, వెంటిలేషన్, వోల్టేజ్, తయారీ నాణ్యత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ నివేదిక ప్రకారం.. ఎక్కువగా వాడే LED టీవీ సగటు జీవితకాలం 50,000 నుండి 1,00,000 గంటలు. క్రమం తప్పకుండా వాడితే, ఒక టీవీ దాదాపు 5 నుండి 10 సంవత్సరాల వరకు సులభంగా ఉంటుంది.

ఉపయోగం: మీరు టీవీని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, దాని జీవితకాలం అంత తక్కువగా ఉంటుందని గుర్తించుకోండి. అలాగే, మీ ప్రాంతంలో చాలా వోల్టేజ్ సమస్యలు ఉంటే, వోల్టేజ్ మీ టీవీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది.

ఉత్పత్తి నాణ్యత: టీవీ బ్రాండ్‌లో కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే టీవీ స్థానిక కంపెనీ నుండి అయితే అది తక్కువ నాణ్యత గల భాగాలను ఉపయోగించవచ్చు. విడిభాగాలు స్థానిక నాణ్యతతో ఉంటే, టీవీ జీవితకాలం కూడా తగ్గవచ్చు.

టీవీని ఎప్పుడు మార్చాలి?: మీరు మీ టీవీ డిస్‌ప్లేతో తరచుగా సమస్యలను ఎదుర్కొంటుంటే లేదా సాంకేతిక లోపం కారణంగా ప్రతి రెండు నుండి మూడు నెలలకు ఒకసారి మీ టీవీని మరమ్మతు చేయాల్సి వస్తే, మీ టీవీని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. స్మార్ట్ టీవీని సకాలంలో శుభ్రం చేయడం కూడా ముఖ్యం. టీవీ స్క్రీన్ శుభ్రం చేసేటప్పుడు మీరు నిర్లక్ష్యంగా చేస్తే స్క్రీన్‌ దెబ్బతింటుంది. డిస్‌ప్లే చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, స్క్రీన్ శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. టీవీ డిస్‌ప్లేలను శుభ్రం చేయడానికి ప్రజలు తువ్వాలను ఉపయోగించడం సరైనది కాదు. దీని కోసం మీరు ఎల్లప్పుడూ మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించాలి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి