AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 16: ఒక్క రూపాయి కట్టకుండానే ఐఫోన్‌ 16.. అది కూడా డిస్కౌంట్‌లో.. షరతులు వర్తిస్తాయ్‌!

iPhone 16: ఒక్క రూపాయి కట్టకుండానే ఐఫోన్‌ 16ను కొనుగోలు చేయవచ్చని, అది కూడా డిస్కౌంట్‌లో తీసుకోవచ్చన్న విషయం సరైనదే. కానీ అందులో షరతులు వర్తిస్తాయ్‌ అన్నది గుర్తించుకోవడం చాలా ముఖ్యం. ఈ షరతులు ఏమిటి? ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫోన్‌ను కొనుగోలు చేయడం ఎలాగో తెలుసుకుందాం..

iPhone 16: ఒక్క రూపాయి కట్టకుండానే ఐఫోన్‌ 16.. అది కూడా డిస్కౌంట్‌లో.. షరతులు వర్తిస్తాయ్‌!
ఆపిల్ మాత్రమే కాదు, లెనోవో తన ల్యాప్‌టాప్ ఉత్పత్తిని మూడేళ్లలో పూర్తిగా భారత్‌కు తరలించాలని ప్లాన్ చేస్తోంది. HP, డెల్ కూడా భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. భారత్‌లో తక్కువ వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఈ ధోరణి భారత్‌ను హై-టెక్ తయారీలో కీలక ఆటగాడిగా మార్చే అవకాశం ఉంది.
Subhash Goud
|

Updated on: Apr 03, 2025 | 5:50 PM

Share

చాలా మంది ఐఫోన్ కొనాలని కోరుకుంటారు కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా కొనలేకపోతున్నారు. కానీ మీరు ఐఫోన్ పూర్తి ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. డిస్కౌంట్ తో చౌకగా ఐఫోన్ కొనడానికి ఒక మార్గం ఉంది. మీరు నెలవారీ EMIపై ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనిలో మీరు మీ బడ్జెట్ ప్రకారం EMI ని నిర్ణయించుకోగలుగుతారు.

ఇది కూడా చదవండి: WhatsApp Ban: భారతీయులకు వాట్సాప్‌ మరో షాక్‌.. 9.7 మిలియన్ల వాట్సాట్స్‌ ఖాతాలు బ్యాన్‌!

ఐఫోన్ 16 చౌకగా కొనండి:

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 16 అసలు ధర రూ. 79,900. కానీ మీరు దీన్ని ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి డిస్కౌంట్‌తో కేవలం రూ. 74,400 కు కొనుగోలు చేయవచ్చు. మీరు దీన్ని EMIలో కొనాలనుకుంటే, దాని నెలవారీ EMI రూ. 3,607 అవుతుంది. మీరు దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ 5 రంగుల ఆప్షన్‌లలో లభిస్తుంది. అంతే కాకుండా మూడు స్టోరేజీలలో ఉన్న ఈ ఫోన్‌ను దేనినైనా ఎంచుకోవచ్చు.

ఐఫోన్ 16 పై భారీ తగ్గింపు:

ఇది ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,900కు లభిస్తుంది. మీరు దీన్ని ఇక్కడ నుండి నెలవారీ EMI రూ. 6,242కి కొనుగోలు చేయవచ్చు. మీరు ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ మీకు చాలా చౌకగా లభిస్తుంది.

మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి విలువ మీ పాత మొబైల్‌ స్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. మీ పాత ఫోన్ మోడల్, బాడీ, కండిషన్, బ్యాటరీ స్థాయి, పనితీరును పరిశీలించిన తర్వాత మార్పిడి విలువ నిర్ణయించవచ్చు. అయితే మీరు ఎన్ని నెలల పాటు చెల్లిస్తారో దానిని బట్టి ఈఎంఐ మొత్తంలో తేడా ఉండవచ్చు. తక్కువ సమయంలో చెల్లిస్తే ఎక్కువ ఈఎంఐ అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ నెలల పాటు చెల్లిస్తే తక్కువ ఈఎంఐ ఉంటుందని గుర్తించుకోండి.

ఐఫోన్ 16 ఫీచర్లు:

ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చబడింది. ఇది దాని మునుపటి మోడళ్ల కంటే 30 శాతం వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఐఫోన్ 16 లో అందించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లలో యాక్షన్ బటన్ అందించింది కంపెనీ. దీని వల్ల అనేక ప్రయోజనాల కోసం సెట్ చేయవచ్చు. మీరు కెమెరా యాప్‌ను తెరిచి ఫోకస్ మోడ్‌ను కూడా మార్చవచ్చు. దీనిలో మీకు గొప్ప కెమెరా లభిస్తుంది. ఇది ఫోటో-వీడియోగ్రఫీకి గొప్ప ఎంపికగా ఉంటుంది.

ఇదిలా ఉండగా.. ఆపిల్ ఈ సంవత్సరం తన ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లలో పెద్ద మార్పులు ఉండే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 తో పోలిస్తే దీనిలో ఎలాంటి అప్‌గ్రేడ్‌లు అందుబాటులో ఉంటాయో టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. స్క్రీన్‌సైజు, కెమెరా, చిప్‌సెట్‌లలో మార్పులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Smart TV Lifespan: స్మార్ట్ టీవీకి గడువు తేదీ ఉంటుందా? దాని జీవిత కాలం ఎంత?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి