AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Ban: భారతీయులకు వాట్సాప్‌ మరో షాక్‌.. 9.7 మిలియన్ల వాట్సాట్స్‌ ఖాతాలు బ్యాన్‌!

WhatsApp Ban: వాట్సాప్‌కు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం స్పామింగ్, థర్డ్-పార్టీ అప్లికేషన్లకు సంబంధించినవి. ఇది కాకుండా ప్రజలు తమ అనుమతి లేకుండా వివిధ గ్రూపులలో చేర్చబడిన కొన్ని కేసులను కూడా నివేదించారు. ఈ ఫిర్యాదులన్నింటినీ వాట్సాప్ విచారించి, అలాంటి తప్పుడు పనులు చేస్తున్న ఖాతాలను నిషేధించింది..

WhatsApp Ban: భారతీయులకు వాట్సాప్‌ మరో షాక్‌.. 9.7 మిలియన్ల వాట్సాట్స్‌ ఖాతాలు బ్యాన్‌!
Subhash Goud
|

Updated on: Apr 03, 2025 | 4:54 PM

Share

భారతదేశంలో ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ WhatsApp అనేక ఖాతాలు నిషేధించింది. IANS నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2025లో భారతదేశంలో 9.7 మిలియన్ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు ఏప్రిల్ 1, 2025న వాట్సాప్‌ తెలిపింది. భారతదేశంలో వాట్సాప్‌ను ఉపయోగించడం కోసం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్‌ తెలిపింది.

వాట్సాప్ ఖాతాలను ఎందుకు నిషేధించింది?

వాట్సాప్ ఫిబ్రవరి 2025 భద్రతా నివేదిక ప్రకారం.. కంపెనీ 1.4 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది. దీని గురించి ఏ యూజర్ కూడా ఫిర్యాదు చేయలేదు. భారతదేశంలో వాట్సాప్‌కు 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. AI-ఆధారిత మోడరేషన్, అధునాతన రిపోర్టింగ్ సాధనాలలో పెట్టుబడి పెట్టడం వల్ల భారతదేశంలో ఈ 9.7 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు కంపెనీ తెలిపింది.

వాట్సాప్ చాలా సంవత్సరాలుగా కృత్రిమ మేధస్సుపై నిరంతరం పనిచేస్తోందని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. దీనితో పాటు, మా డేటా నిపుణులు ప్లాట్‌ఫామ్‌లోని అందరు వినియోగదారులకు పూర్తి భద్రతను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల భద్రతకు హాని కలిగించే తప్పుడు కంటెంట్‌ను నిరోధించడానికి వాట్సాప్ ఈ చర్య తీసుకుంది.

మరిన్ని చర్యలు

2021 ఐటీ రూల్స్ ప్రకారం.. వినియోగదారులు నివేదించిన ఖాతాలపై కంపెనీ తదుపరి చర్యలు తీసుకుందని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించే ఆటోమేటెడ్ డిటెక్షన్ సిస్టమ్ ఉందని కంపెనీ తెలిపింది.

వాట్సాప్‌కు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం స్పామింగ్, థర్డ్-పార్టీ అప్లికేషన్లకు సంబంధించినవి. ఇది కాకుండా ప్రజలు తమ అనుమతి లేకుండా వివిధ గ్రూపులలో చేర్చబడిన కొన్ని కేసులను కూడా నివేదించారు. ఈ ఫిర్యాదులన్నింటినీ వాట్సాప్ విచారించి, అలాంటి తప్పుడు పనులు చేస్తున్న ఖాతాలను నిషేధించింది.

జనవరిలో 99 లక్షల వాట్సాప్ ఖాతాలు నిషేధం:

ఈ ఏడాది జనవరిలో 9.9 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ ఇటీవల తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న స్కామ్‌లు, స్పామ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపడానికి ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జనవరి 1 నుండి జనవరి 30 వరకు మొత్తం 99 లక్షల 67 వేల ఖాతాలను బ్లాక్ చేశారు. వీటిలో 13.27 లక్షల ఖాతాలను ఎటువంటి ఫిర్యాదు అందకముందే నిషేధించారు. జనవరిలో వాట్సాప్‌కు దాని వినియోగదారుల నుండి 9,474 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 239 ఖాతాలపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఖాతాలను బ్లాక్ చేయడంతో సహా ఇతర చర్యలు తీసుకుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి