పవర్ బ్యాంక్ వాడితే మీ స్మార్ట్‌ ఫోన్‌ పాడవుతుందా..? నిజమేనా..?

03 April 2025

Subhash

పవర్ బ్యాంక్ ఉపయోగించడం సురక్షితమే. కానీ దానిని తప్పుగా వాడితేనే ఫోన్‌ పాడయ్యే అవకాశాలు ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

పవర్ బ్యాంక్

పవర్ బ్యాంక్ నాణ్యత, దాని ఛార్జింగ్ వేగం, దానితో ఉపయోగించే ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ కూడా మీ ఫోన్ సురక్షితంగా ఉంటుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 

పవర్ బ్యాంక్

నాణ్యత లేని పవర్ బ్యాంక్ మీ ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా, భవిష్యత్తులో బ్యాటరీ సమస్య కూడా తలెత్తవచ్చు.

నాణ్యత లేని పవర్ బ్యాంక్ 

ఐఫోన్ కోసం ఎల్లప్పుడూ ఆపిల్ సర్టిఫైడ్ ఉన్న ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్‌ను ఉపయోగించండి. ఇది మీ ఫోన్ బ్యాటరీపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. 

ఐఫోన్ కోసం

ఆపిల్ ఛార్జింగ్ అడాప్టర్: 5W, 18W, 20W, 30W పవర్ అవుట్‌పుట్‌ను అందించే ఆపిల్-సర్టిఫైడ్ అడాప్టర్‌ను ఉపయోగించండి.

ఆపిల్ ఛార్జింగ్ అడాప్టర్

క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీకి అనుకూలమైన పవర్ బ్యాంక్‌ను శామ్‌సంగ్ వంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొనుగోలు చేయవచ్చు. 

ఆండ్రాయిడ్

ఈ పవర్ బ్యాంకులు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవు. కానీ వీటిని కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి.

పవర్‌ బ్యాంకులు

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎల్లప్పుడూ కంపెనీ సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. అలాగే బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది.

ఛార్జర్‌