యువకుడి దారుణ హత్య.. అతని ఇంట్లోనే 12 ముక్కలుగా నరికి, పాలిథీన్‌ సంచుల్లో కుక్కి..

ఓ యువకుడిని అతని ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, 12 ముక్కలుగా నరికారు. అనంతరం శరీర భాగాలను పాలిథీన్ కవర్లలో కుక్కి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో బోలింగర్ జిల్లాలో బుధవారం (మే 17) చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం...

యువకుడి దారుణ హత్య.. అతని ఇంట్లోనే 12 ముక్కలుగా నరికి, పాలిథీన్‌ సంచుల్లో కుక్కి..
Odisha Crime
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2023 | 6:20 PM

ఓ యువకుడిని అతని ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, 12 ముక్కలుగా నరికారు. అనంతరం శరీర భాగాలను పాలిథీన్ కవర్లలో కుక్కి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో బోలింగర్ జిల్లాలో బుధవారం (మే 17) చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం..

మృతుడిని రింకు మెహర్‌ (27)గా పోలీసులు గుర్తించారు. బోలింగర్ జిల్లాలోని సలేపలి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముడుతో కలిసి రింకు మెహెల్‌ నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న రింకు, 20 రోజుల క్రితం తల్లిదండ్రులపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. అనంతరం వారిని బుర్లా మెడికల్‌ సెంటర్‌లో చికిత్స నిమిత్తం జాయిన్‌ చేశాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన రింకు తమ్ముడు కూడా ఆదృశ్యమయ్యాడు. రింకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు లోపలినుంచి గొళ్లెం పెట్టి ఉండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. 7 పాలిథిన్‌ బ్యాగుల్లో రింకు శరీర భాగాలను నీట్‌గా సర్ది ఉండటం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే యువకుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నిందితులు నరికి ఉంటారని వారు భావిస్తున్నారు.

‘పథకం ప్రకారం జరిగిన హత్యగా తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రింకూకి తల్లిదండ్రులతో గొడవలు ఉన్నాయని తెలిసింది. అందుకే ఈ కేసులో వారి ప్రమేయం ఏమైనా ఉందా లేదా మరేదైనా కారణం వల్ల హత్య జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటామని’ బోలంగీర్ సబ్ డివిజనల్ పోలీస్‌ అధికారి తోఫాన్ బాగ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?