’81 ఏళ్ల క్రితం యాక్సిడెంట్‌లో చనిపోయా.. ఇప్పుడు మళ్లీ పుట్టా’ పూర్వజన్మ గురించి మాట్లాడుతోన్న తొమ్మిదేళ్ల బాలిక

పునర్జన్మ గురించి భిన్న మతాల్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మరణించిన తర్వాత మళ్లీ పుడతామనే భావనే పునర్జన్మగా నమ్ముతారు. సాధారణంగా మరణించిన వ్యక్తి కోటి సంవత్సరాల తర్వాత మళ్లీ మనిషి రూపంలో జన్మించే అవకాశం ఉందని చెబుతుంటారు. అందుకే చాలా మందికి పునర్జన్మపై అపార నమ్మకం ఉంటుంది. మరికొందరేమో పిట్టకథలని కొట్టిపారేస్తుంటారు. తాజాగా ఓ అమెరికాలో ఓ విచిత్ర..

'81 ఏళ్ల క్రితం యాక్సిడెంట్‌లో చనిపోయా.. ఇప్పుడు మళ్లీ పుట్టా' పూర్వజన్మ గురించి మాట్లాడుతోన్న తొమ్మిదేళ్ల బాలిక
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2023 | 4:57 PM

పునర్జన్మ గురించి భిన్న మతాల్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మరణించిన తర్వాత మళ్లీ పుడతామనే భావనే పునర్జన్మగా నమ్ముతారు. సాధారణంగా మరణించిన వ్యక్తి కోటి సంవత్సరాల తర్వాత మళ్లీ మనిషి రూపంలో జన్మించే అవకాశం ఉందని చెబుతుంటారు. అందుకే చాలా మందికి పునర్జన్మపై అపార నమ్మకం ఉంటుంది. మరికొందరేమో పిట్టకథలని కొట్టిపారేస్తుంటారు. తాజాగా ఓ అమెరికాలో ఓ విచిత్ర సంఘటన బయటపడింది. 81 ఏళ్ల క్రితం కారు యాక్సిడెంట్‌లో మృతి చెంది.. ఈ జన్మలో స్త్రీగా జన్మించినట్లు తొమ్మిదేళ్ల బాలిక చెప్తోంది. బాలిక చెబుతున్న వివరాలు కూడా నిజంగానే జరిగి ఉండటం మరో ట్విస్ట్. ఈ వ్యవహారం ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

అమెరికాకు చెందిన ఆష్లీ అనే మహిళ తన 9 ఏళ్ల కుమార్తె ముసలి వాళ్లలా, తన గత జన్మ గురించి మాట్లాడుతోందని మీడియాకు తెల్పింది. తన కూతురికి ఐదేళ్లు ఉన్నప్పటి నుంచి గత జన్మ గురించి చెబుతూ ఉండేదని.. ఐతే సరదాగా చెబుతుందని అష్లీ భావించింది. ఆష్లీ తన కూతురిని మూడేళ్లలో రెండుసార్లు ఒకే ప్రశ్న అడిగింది. ప్రతిసారీ అదే సమాధానం చెప్పడంతో తన కూతురు అబద్ధం చెప్పడం లేదని నిర్ధారించుకుంది. ఒకే విషయం గురించి పదే పదే చెబుతుండటంతో అవి కథలు కాదని నిజంగానే తన పూర్మజన్మ గురించి మాట్లాడుతోందని అష్లీ గ్రహించింది. దీంతో తన పూర్వ జన్మ గురించి అష్లీ తన కూతురిని అడిగింది. గత జన్మలో తాను స్త్రీగా జన్మించానని, తల్లి చాలా కాలం క్రితమే మరణించినట్లు తెల్పింది. తన తండ్రి పేరు శామ్యుల్‌ అని చెప్పింది. 1942లో ఓ కారు ప్రమాదంలో తాను మరణించినట్లు తెల్పింది. ఇప్పుడు మరో శరీరం ద్వారా ఈ ప్రపంచానికి తిరిగి వచ్చినట్లు తెల్పింది.

దీంతో ఆష్లీ తన కుమార్తె చెప్పిన తేదీ, ప్రదేశంలో జరిగిన సంఘటనలను విచారించగా.. అది నిజమని తేలింది. తన కుమార్తె చెప్పిన తేదీ రోజున ఆ స్థలంలో ఓ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి, అతని కుమార్తె మరణించారు. ఆష్లీ తన కుమార్తె పూర్వ జన్మ వివరాలను ప్రజలతో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.