AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఆధార్ కార్డు పోయిందా..? ఐతే ఇలా సులభంగా ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..

ఉద్యోగం, బ్యాంకు ఖాతా, ప్రభుత్వ పథకాలు, చదువులు.. ఇలా ప్రతిదానికి ఆధార్ దృవీకరణ తప్పనిసరైపోయింది. ఆధార్‌ కార్డు లేనిదే ఏ పని చేయలేని స్థితికి చేరిపోయామంటే అతిశయోక్తి కాదేమో. దీంతో దేశంలో దాదాపు ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డు తీసుకుంటున్నారు. ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ డేటా వంటి వ్యక్తిగత సమాచారం..

Aadhaar: ఆధార్ కార్డు పోయిందా..? ఐతే ఇలా సులభంగా ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..
How To Get Duplicate Aadhaar Card
Srilakshmi C
|

Updated on: May 16, 2023 | 5:40 PM

Share

ఉద్యోగం, బ్యాంకు ఖాతా, ప్రభుత్వ పథకాలు, చదువులు.. ఇలా ప్రతిదానికి ఆధార్ దృవీకరణ తప్పనిసరైపోయింది. ఆధార్‌ కార్డు లేనిదే ఏ పని చేయలేని స్థితికి చేరిపోయామంటే అతిశయోక్తి కాదేమో. దీంతో దేశంలో దాదాపు ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డు తీసుకుంటున్నారు. ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ డేటా వంటి వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డును పొరబాటున ఎక్కడైనా పోగొట్టుకుంటే…? కంగారు పడకండి.. డూబ్లికేట్ ఆధార్ కార్డ్ పొందడం ఇప్పుడు చాలా సులువు. ఆధార్ కార్డును ఈజీగా UIDAI పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు మీ పేరు, పుట్టిన తేదీ, మీ ఆధార్ కార్డ్ పై ఉన్న 12 అంకెల నెంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. అదెలాగంటే..

UIDAI పోర్టల్ నుంచి ఆధార్ కార్డ్ ఇలా పొందండి..

  • UIDAI సర్వీస్ పోర్టల్ ను ఓపెన్‌ చెయ్యాలి.
  • లాస్ట్ లేదా ఫర్గెటెన్ UID/EID’ బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ నంబర్, మీ పూర్తి పేరు, ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • స్క్రీన్ పై కనిపించే సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి, ‘వన్ టైం పాస్ వర్డ్ పొందండి’ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్ మొబైన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆతర్వాత మొబైల్‌కు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ వస్తుంది.
  • తిరిగి UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ లోకి మళ్లీ వెళ్లి.. ‘డౌన్ లోడ్ ఆధార్’ బటన్ క్లిక్‌ చేయాలి.
  • మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పేరు, పిన్ కోడ్ , క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
  • ‘గెట్ వన్ టైం పాస్ వర్డ్’ బటన్ క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత, మీ ఆధార్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UIDAI హెల్ప్‌లైన్ సహాయంతో కూడా ఆధార్ కార్డ్ పొందవచ్చు. UIDAI హెల్ప్‌లైన్‌ 1800-180-1947 (టోల్-ఫ్రీ) లేదా 011-1947 (లోకల్)కి ఉదయం 7:00 నుంచి రాత్రి 10:00 వరకు ఫోన్‌ చేయవచ్చు. IVR సూచనల మేరకు ‘ఆధార్ కార్డును తిరిగి పొందడానికి’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర అవసరమైన వివరాలను తెలపాలి. వెరిఫికేషన్ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ వస్తుంది. ఆ తర్వాత మీ UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ కార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.