Viral Video: బీరు పోయలేదని ఈ మేక ఏం చేసిందో చూడండి.. ‘మందు ద్రోహం తట్టుకోలేం భయ్యా’ వీడియో వైరల్
టైంకి గొంతు తడవకపోతే మందుబాబులకు పిచ్చెక్కి పోతుంది. వెర్రి వేషాలేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాళ్లను మీ చుట్టుపక్కన గమనించే ఉంటారు. ఈ మధ్య కాలంలో మనుషులే కాదు.. జంతువులు కూడా చుక్కకు అలవాటు పడ్డాయి. తాజాగా మద్యానికి బానిసైన ఓ మేక బీరు పోయలేదని ఏకంగా దాడికి..
టైంకి గొంతు తడవకపోతే మందుబాబులకు పిచ్చెక్కి పోతుంది. వెర్రి వేషాలేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాళ్లను మీ చుట్టుపక్కన గమనించే ఉంటారు. ఈ మధ్య కాలంలో మనుషులే కాదు.. జంతువులు కూడా చుక్కకు అలవాటు పడ్డాయి. తాజాగా మద్యానికి బానిసైన ఓ మేక బీరు పోయలేదని ఏకంగా దాడికి తెగబడింది. మద్యం కోసం ఓ వ్యక్తిపై మేక దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి..
ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఇంటి బయట కూర్చుని బీర్ తాగుతుంటారు. బీరు క్యాన్‌లు ఒకదాన్ని తర్వాత ఒకటి లాగంచేస్తూ యమ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో అక్కడికి ఓ మేక వస్తుంది. అక్కడ ఉన్న బీర్ క్యాన్లను వాసన చూసి, తనకు కూడా పోస్తారన ఆశతో ఎదురు చూస్తుంటుంది. ఐతే దానికి పోయకుండా వారే సేవించడంతో, మేకకు కోపం వస్తుంది. అంతే నాలుగడుగులు వెనక్కి వేసి.. పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి కొమ్ములతో దాడి చేసింది. ఆ తర్వాత కూడా మళ్లీ మేక అల్లంత దూరం నడుచుంటూ వెళ్లి ఉరుక్కుంటూ వచ్చి కొమ్ములతో సదరు వ్యక్తిపై పలు మార్లు దాడి చేస్తుంది.
View this post on Instagram
దీంతో ఆ వ్యక్తి తప్పించుకోవడానికి రోడ్డుపై పరిగెత్తుతాడు. ఐనా.. మేక అతన్ని వదలకుండా వెంబడించడం వీడియోలో చూడొచ్చు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైకులు రావడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.