Niharika Konidela: ‘అదంతా మీడియానే సృష్టించింది.. నా వరకైతే ఆ వార్తలు రాలేదు’
‘ఒక మనసు’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత తరచూ ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. ఇక గత కొంతకాలంగా నీహారికి- చైతన్యల వైవాహిక జీవితంపై నెట్టింట పలు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వీటిపై ఇప్పటిరకూ మెగా ఫ్యామిలీ స్పందించలేదు..
‘ఒక మనసు’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత తరచూ ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. ఇక గత కొంతకాలంగా నీహారిక, భర్త చైతన్యల వైవాహిక జీవితంపై నెట్టింట పలు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వీటిపై ఇప్పటిరకూ మెగా ఫ్యామిలీ స్పందించలేదు. గతంలో పలు సిరీస్‌లు, సినిమాలు, షోలు చేసిన నిహారిక ఆ తర్వాత యాక్టింగ్‌కి కాస్త విరామం తీసుకుంది. నిజానికి నిహారికకు సినిమాల కంటే వెబ్ సిరీస్ బాగా కలిసి వచ్చాయని చెప్పాలి.
ఆమె నటించిన ‘ముద్దపప్పు అవకాయ’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెబ్ సిరీస్‌ల్లో నటించడమే కాదు వాటికి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం నిహారిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. ఆన్‌లైన్ గేమ్స్ ఆడే యూత్ కి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అని భావిస్తున్నారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ హాట్ స్టార్, ఓటీటీలో మే 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ‘డెడ్ పిక్సెల్స్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీహారిక పలు రూమర్స్‌కు చెక్ పెట్టింది.
నటపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ వల్ల మొదట్లో కొంత బాధపడినా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశా. పుష్ప 2లో నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు. ఇదంతా మీడియానే సృష్టించింది. పుష్ప 2 చాలా మంచి సినిమా.. ఐతే ఆ సినిమా కోసం నన్నెవ్వరూ సంప్రదించలేదంటూ నిహారిక క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ ఐపీఎల్‌లో ఓ టీంని కొంటున్నాడని వస్తున్న వార్తలపై నిహారికను ప్రశ్నించగా.. అవునా.. నాకైతే చరణ్ అన్న చెప్పలేదు. ఏ టీం కొంటున్నాడంటూ? నా వరకైతే ఈ వార్త రాలేదని సమాధానమిచ్చింది.
మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.