‘మీరెవరో మాకు తెలియదు.. పరిచయం ఇవ్వండి’ తిరుపతి వివాదంపై డైరెక్టర్‌ నందినీ రెడ్డి క్లారిటీ

టాలీవుడ్‌ లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి గురించి పరిచయం అక్కరలేదు. డైరెక్టర్‌గా 'అలా మొదలైంది' మువీతో ఘన విజయం అందుకున్న నందినీ రెడ్డి.. ఆ తర్వాత జబర్దస్ట్, కల్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి పలు సక్సెస్‌ఫుల్‌ సినిమాలను అందించారు. తాజాగా నందినీ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన..

'మీరెవరో మాకు తెలియదు.. పరిచయం ఇవ్వండి' తిరుపతి వివాదంపై డైరెక్టర్‌ నందినీ రెడ్డి క్లారిటీ
Director Nandini Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2023 | 9:02 AM

టాలీవుడ్‌ లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి గురించి పరిచయం అక్కరలేదు. డైరెక్టర్‌గా ‘అలా మొదలైంది’ మువీతో అరంగెట్రం చేసి ఘన విజయం అందుకున్న నందినీ రెడ్డి.. ఆ తర్వాత జబర్దస్ట్, కల్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి పలు సక్సెస్‌ఫుల్‌ సినిమాలను అందించారు. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మువీ ‘అన్నీ మంచి శకునములే’ మువీ ఈనెల 18 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మువీ ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతి ప్రెస్‌మీట్‌లో జరిగిన ఓ సంఘటనపై నందినిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఆసలారోజు ఏం జరిగిందంటే..

‘సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల మా టీం తిరుపతి వెళ్లాం. అయితే ప్రెస్‌మీట్‌ మూడు గంటలకేనని విలేకర్లకు చెప్పారట. మేము భోజనం చేసి గంటన్నర ఆలస్యంగా వెళ్లేసరికి వాళ్లకు చిరాకు వచ్చినట్టుంది. హీరో సంతోశ్‌ శోభన్‌ మైక్‌ తీసుకుని మాట్లాడుతుండగా ‘మీరెవరో మాకు తెలియదు. పరిచయం ఇచ్చి మాట్లాడండి’ అంటూ ఓ జర్నలిస్టు కాస్త గట్టిగానే అన్నాడు. ఆయన మాటలు నాకు ఇబ్బందిగా అనిపంచడంతో వెంటనే మైక్‌ తీసుకుని.. నటీనటులు, వైజయంతి బ్యానర్‌, నేను చేసిన సినిమాల గురించి చెప్పాను.

ఆ తర్వాత ఎందుకైనా మంచిది నువ్వు కూడా నీ గురించి పరిచయం చేసుకోమని సంతోష్‌ శోభన్‌కు చెప్పాను. ఆ మాట సదరు జర్నలిస్టుకి నచ్చలేదనుకుంటా, అన్నిసార్లు మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. దీంతో ‘సార్‌.. మేము ఏం చెప్పాలో, ఎన్నిసార్లు చెప్పాలో మీరే చెబుతున్నారు. నాదొక రిక్వెస్ట్‌. మీరు ప్రెస్‌మీట్‌కు వచ్చినప్పుడు సినిమా ఏంటి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుని వస్తే.. మీరు ప్రశ్నలు అడగటానికి, అలాగే మేమూ మంచిగా సమాధానాలు చెప్పే ఛాన్స్‌ ఉంటుంది కదా’ అని మర్యాదపూర్వకంగా చెప్పాను. వాళ్లేమో నా మాటల్ని కౌంటర్‌ అనుకుంటున్నారు. అంతేగానీ నేను వాళ్లతో గొడవపడింది లేదని’ నందినిరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.