శ్రీవారి భక్తులకు అలర్ట్! తితిదే పేరిట 52 నకిలీ వెబ్‌సైట్లు, 13 నకిలీ మొబైల్ యాప్‌లు
తిరుమలలో మే 14 నుంచి 18 వరకు ఐదురోజుల పాటు హనుమత్ జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు. తిరుమలలో శనివారం ఉదయం రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో శ్రమదాన కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని ధర్మారెడ్డి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హనుమత్ […]
తిరుమలలో మే 14 నుంచి 18 వరకు ఐదురోజుల పాటు హనుమత్ జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు. తిరుమలలో శనివారం ఉదయం రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో శ్రమదాన కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని ధర్మారెడ్డి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో..
- మే 14న తుని తపోవనం సచ్చిదానంద స్వామి
- మే 15న కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిస్వామి
- మే 16న కంచి పీఠాధిపతి విజయేంద్రసరస్వతి స్వామి
- మే 17న అహోబిల మఠాధిపతి శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి
- మే 18న పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతీ తీర్థ స్వామీజీలు అనుగ్రహ భాషణం చేయనున్నారు
అలాగే తిరుమల వేదవిజ్ఞాన పీఠంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు 67 మంది ప్రముఖ పండితులతో అఖండ పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తామన్నారు.
నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి..
ఇక తిరుమలలో వేసవిలో రద్దీ కారణంగా రోజుకు శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు కలిపి 55 వేలు కేటాయిస్తున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనంలో రోజుకు 10 నుంచి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్‌లో పాదరక్షలు భద్రపరిచే కేంద్రాలను ప్రారంభించామని, త్వరలో పీఏసీ 1, 2, 3, నారాయణగిరి క్యూలైన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలన్నారు. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబోమన్నారు. తితిదే పేరిట ఉన్న 52 నకిలీ వెబ్‌సైట్లు, 13 నకిలీ మొబైల్ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ వెబ్‌సైట్ల గురించి తెలిస్తే 155257 కాల్‌సెంటర్‌కు సమాచారం అందిచాలని ఈవో సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.