Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Station: పోలీస్‌ అధికారి సీట్లో కూర్చొని డ్రింక్ పార్టీ.. దెబ్బకు బాస్‌ సస్పెండ్.. అబ్బాయ్‌ అరెస్ట్

రోడ్డుపై ఎక్కడైనా మద్యం పుచ్చుకుని పోలీసుల కంటపడితే డొక్కచీరేస్తారు. అదే ఓ వ్యక్తి ఏకంగా ఖాఖీల ముందే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి.. అదీ స్టేషన్‌ ఇన్‌ఛార్జి సీటులో దర్జాగా కూర్చొని ఓ వ్యక్తి మందు సేవించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ తీసి మీడియాలో పోస్టు కూడా చేశాడు. అదికాస్తా వైరల్‌..

Police Station: పోలీస్‌ అధికారి సీట్లో కూర్చొని డ్రింక్ పార్టీ.. దెబ్బకు బాస్‌ సస్పెండ్.. అబ్బాయ్‌ అరెస్ట్
Man Drinks Inside Police Station
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2023 | 3:45 PM

రోడ్డుపై ఎక్కడైనా మద్యం పుచ్చుకుని పోలీసుల కంటపడితే డొక్కచీరేస్తారు. అదే ఓ వ్యక్తి ఏకంగా ఖాఖీల ముందే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి.. అదీ స్టేషన్‌ ఇన్‌ఛార్జి సీటులో దర్జాగా కూర్చొని ఓ వ్యక్తి మందు సేవించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ తీసి మీడియాలో పోస్టు కూడా చేశాడు. అదికాస్తా వైరల్‌ అవడంతో రచ్చ రచ్చ అయింది. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కుర్చీలో కూర్చుని ఇమ్రాన్ అనే వ్యక్తి మద్యం గ్లాసులో పోసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సచిన్ త్యాగి కూర్చునే కుర్చీలో కూర్చుని మద్యం గ్లాసులో పోసుకోవడం కనిపించింది. అతని ముందున్న టేబుల్‌పై చిప్స్‌ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ సంఘటన గత మార్చి నెలలో హోలీ సందర్భంగా జరిగినట్లు భావిస్తున్నారు. సోషల్‌ మీడియా వైరల్‌ అయిన ఈ ఫోటో పోలీసుల దృష్టికి రావడంతో ఎస్‌ఎస్పీ విపిన్ తడా సదరు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి సచిన్ త్యాగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మద్యం సేవించిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. బాధ్యతాయుతమైన పోలీసధికారి ఇలాగేనా ప్రవర్తించేదంటూ నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
RCBని గరీబ్ జట్టు అంటూ సెహ్వాగ్ సెటైర్!
RCBని గరీబ్ జట్టు అంటూ సెహ్వాగ్ సెటైర్!
కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. సంపదలో ఎక్కువ భాగం..
జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. సంపదలో ఎక్కువ భాగం..
రోహిత్ ఫామ్‌పై అంబానీ సీరియస్! అయోమయంలో MI ఫ్యాన్స్?
రోహిత్ ఫామ్‌పై అంబానీ సీరియస్! అయోమయంలో MI ఫ్యాన్స్?
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు