’14 ఏళ్లుగా భోజనం చేయడం లేదు.. ఆకలి కంట్రోల్ చేయడానికి 2 బిస్కెట్లు తిని, కడుపునిండా నీళ్లు తాగుతున్నా’

ఫ్యామిలీ మ్యాన్-2తో పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అందరికీ సుపరిచితుడే. తన విలక్షన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో..

'14 ఏళ్లుగా భోజనం చేయడం లేదు.. ఆకలి కంట్రోల్ చేయడానికి 2 బిస్కెట్లు తిని, కడుపునిండా నీళ్లు తాగుతున్నా'
Manoj Bajpayee
Follow us
Srilakshmi C

|

Updated on: May 11, 2023 | 4:39 PM

ఫ్యామిలీ మ్యాన్-2తో పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అందరికీ సుపరిచితుడే. తన విలక్షన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమకథ’, బన్నీ హీరోగా నటించిన ‘హ్యాపీ’ మువీల్లో తనదైన నటనతో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి పలు ఆసక్తికరల విషయాలు పంచుకున్నారు.

గత 13-14 సంవత్సరాలుగా మా తాతగారి డైట్‌ ఫాలో అవుతున్నాను. నేను రాత్రి భోజనం పూర్తిగా మానేశాను. అందుకే 54 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నాను. మొదట్లో రోజులో 12-14 గంటల ఉపవాసం ఉండేవాన్ని. ఆకలిగా అనిపించినప్పుడు 2 బిస్కెట్లు తిని.. చాలా నీళ్లు తాగేవాడ్ని. వారంపాటు చాలా కష్టంగా అనిపించింది. క్రమంగా రాత్రి భోజనం చేయడం మానేశాను. ఇప్పుడు లంచ్ తర్వాత, మా వంటగది పూర్తిగా బంద్‌ అవుతుంది. నా కూతురు హాస్టల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. డాక్టర్‌ కూడా ఉదయం బ్నేక్‌ ఫాస్ట్‌ మానేయడం కన్నా రాత్రి డిన్నర్‌ మానేయడం మంచిద‌ని సలహా ఇచ్చారు. లేకుంటే తిన్న ఆహారం పొట్టలోనే మిగిలిపోతుందన్నారు.

ఈరోజుల్లో చాలా మంది ఉపవాసం చేస్తున్నారు. కానీ నేను చాలా సంవత్సరాలుగా దీన్ని అనుసరిస్తున్నాను. ప్రతి రోజూ దాదాపు 18 గంటలపాటు ఉపవాసం ఉంటాను. ఆరోగ్యకరమైన ఆహారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మాత్రమే తింటాను. ఇలా చేయడం వల్ల బరువు అదుపులో ఉండటంతోపాటు ఎనర్జీతో ఉండగలుగుతున్నాను’ అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్‌-3 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.