‘ఏడుస్తున్నాడనీ..’ నెలల వయసున్న కొడుకును నేలకేసి కొట్టిన ప్రముఖ నటి భర్త..!
బాలీవుడ్ సీరియల్ నటి చంద్రిక సాహా (40) తెలియని వారుండరు. సీఐడీ, సావధాన్ ఇండియా క్రైమ్ అలర్ట్ వంటి సూపర్ హిట్ సీరియల్స్ నటించి చంద్రిక మంచి పేరు తెచ్చుకుంది. చంద్రిక సాహా గతంలో ఓ వ్యక్తిని వివాహొం చేసుకుని.. కొన్ని కారణాల రిత్య విడాకులు తీసుకుంది. ఆ తర్వాత..
బాలీవుడ్ సీరియల్ నటి చంద్రిక సాహా (40) తెలియని వారుండరు. సీఐడీ, సావధాన్ ఇండియా క్రైమ్ అలర్ట్ వంటి సూపర్ హిట్ సీరియల్స్ నటించి చంద్రిక మంచి పేరు తెచ్చుకుంది. చంద్రిక సాహా గతంలో ఓ వ్యక్తిని వివాహొం చేసుకుని.. కొన్ని కారణాల రిత్య విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2020లో తనకంటే చాలా చిన్నవాడైన ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మిశ్ర (21)తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి సహజీవనం చేయ సాగారు. ఈ క్రమంలోనే చంద్రిక ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ గర్భాన్ని అబార్షన్‌తో తొలిగించుకోవాలని అమన్ మిశ్ర కోరాడు. కానీ చంద్రిక అందుకు అంగీకరించలేదు. ఈ విషయంపై వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండగానే చందరిక మగబిడ్డకు జన్మనించింది. బిడ్డ పుట్టిన తరువాత కూడా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలోనే గత నెలలో చంద్రిక-అమన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
కొడుకు విషయంలో మొదట్నుంచీ గొడవ పడుతూ వచ్చిన అమన్ 15 నెలలు కూడా నిండని చిన్నారిని హతమార్చాలనుకున్నాడు. దీంతో గత శుక్రవారం చంద్రిక కిచెన్‌లో వంట పనిలో ఉండగా కొడుకు ఏడుపు వినిపించింది. దీంతో కొడుకునే ఆడించమని భర్తకి చెప్పి తిరిగి తనపనిలో నిమగ్నమైంది చంద్రిక. అమన్ కొడుకును తీసుకుని బెడ్ రూమ్‌లోకి వెళ్ళాడు. ఆ తర్వాత పెద్ద శబ్ధం వినిపించింది. పిల్లవాడు కూడా గుక్కపెట్టి ఏడవడం చంద్రికకు వినిపించింది. గదిలోకి వెళ్లిన చంద్రికకు కొడుకు రక్తం మడుగులో పడి ఉండటం గమనించింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కొడుకు గాయాలు చూసిన చంద్రికకు అనుమానం వచ్చి ఇంటిలో సీసీటీవీ ఫుటేజీ చూస్తే అసలు విషయం బయట పడింది. పసి బిడ్డను అమన్ ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు నేలకేసి కొట్టాడం చూసి తల్లి ప్రాణం తల్లడిల్లింది. వెంటనే చంద్రిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.