AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెంసాంగ్‌లో హీరోయిన్.. బన్నీకి టైట్ హాగ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిన బ్యూటీ ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' మువీ ఎంత పెద్ద హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో బన్నీ గ్లోబర్ స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా పుష్పలో బన్నీ మ్యానరిజం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక సామ్‌ ఐటెం సాంగ్‌ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ' సోషల్‌ మీడియాను షేక్‌..

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెంసాంగ్‌లో హీరోయిన్.. బన్నీకి టైట్ హాగ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిన బ్యూటీ ..?
Pushpa 2 Item Song
Srilakshmi C
|

Updated on: May 08, 2023 | 7:07 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ మువీ ఎంత పెద్ద హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో బన్నీ గ్లోబర్ స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా పుష్పలో బన్నీ మ్యానరిజం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక సామ్‌ ఐటెం సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ సోషల్‌ మీడియాను షేక్‌ చేసేసింది. దేవీ శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ఊరమాస్ మాసాలా సాంగ్‌ కుర్రకారును గిలిగింతలు పెట్టింది. ఈ పాటకు చంద్రబోస్ రాయగా, సింగర్‌ ‘ఇంద్రవతి చౌహాన్’ గొంతు సవరించారు. ఆ తర్వాత వెండితెరపై దాదాపు రెండేళ్ల నుంచి బన్నీ ఇంకో సినిమాలో కనిపించింది లేదు. పుష్ప పార్ట్‌ 1కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

భారీ అంచనాలతో చిత్రీకరిస్తోన్న పుష్ప 2 మొదటి భాగానికి మించి ఉంటుందని బన్నీ బర్త్ డేకు రిలీజ్ చేసిన పోస్టర్‌తోనే అర్థమైపోయింది. దీంతో ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా మొదలైనప్పటినుంచి ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. పుష్ప 2లో కూడా సామ్‌నే ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా నెట్టింట ఓ ఫోటో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ బ్యూటీతో కలిసి అల్లు అర్జున్‌ను హగ్‌ చేసుకున్న ఫోటోను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘ఎదగడానికి డ్యాన్సర్లకు రెక్కలు అవసరం లేదు.. అది తెలుసుకున్న వారికి వారి ఎనర్జీ దారిచూపుతుంది…’ అంటూ అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేసింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ‘పుష్ప 2లో ఖచ్చితంగా ఈమెనే ఐటమ్ సాంగ్ చేస్తుందని’ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. అదే నిజమైతే సీరత్‌ రేంజ్ మారనుంది. రన్ రాజా రన్ తరువాత సీరత్‌ ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇక ఈ వార్తలో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడవల్సిందే.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై