AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Part-time job Scam: పార్ట్‌ టైం జాబ్ పేరిట ఫోన్‌కు మెసేజ్..! ఇంట్లోనే కూర్చోబెట్టి కోటి రూపాయలు కాజేశారు

ఆన్‌లైన్ టాస్క్ స్కామ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేలో కేటుగాళ్ల వలలో చిక్కుకున్న అమాయక ప్రజలు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్..

Part-time job Scam: పార్ట్‌ టైం జాబ్ పేరిట ఫోన్‌కు మెసేజ్..! ఇంట్లోనే కూర్చోబెట్టి కోటి రూపాయలు కాజేశారు
Part Time Job Scam
Srilakshmi C
|

Updated on: May 08, 2023 | 3:58 PM

Share

ఆన్‌లైన్ టాస్క్ స్కామ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేలో కేటుగాళ్ల వలలో చిక్కుకున్న అమాయక ప్రజలు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌ పేరిట ఉచ్చులోకిలాగి చుక్కలు చూపిస్తున్నారు. అదనపు ఆదాయం పొందవచ్చని ఆశ చూపి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా పూణెకు చెందిన ఓ వ్యక్తి ఈ సైబర్ స్కామర్ల చేతిలో చిక్కుకుని దాదాపు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు.

పూణెలోని బవ్‌ధాన్-ఎన్‌డిఎ రోడ్‌లోని రాంబాగ్ కాలనీకి చెందిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ ఫిల్మ్ మేకర్‌ (56) మొబైల్‌కి పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట మెసేజ్‌ వచ్చింది. మెసేజ్‌లో ఇచ్చిన నంబర్‌ను సంప్రదించగా చాట్ యాప్‌లోని గ్రూప్‌లో చేరమని స్కామర్లు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బాధితుడు జాబ్ చేసేందుకు అంగీకరించడంతో అతన్ని తొలుత నమ్మించడానికి ‘వెల్‌కమ్ బోనస్’ కింద రూ. 10,000 చెల్లించారు. కార్పొరేట్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (CTM) అనే ట్రావెల్‌ ఏజెన్సీకి రేటింగ్‌ ఇవ్వడం ద్వారా మంచి లాభాలు గడించవచ్చని నమ్మబలికారు. అందుకు ముందుగా కొన్ని ప్రీ-పెయిడ్ టాస్క్‌లను పూర్తి చేయవల్సి ఉంటుందని బాధితుడికి తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీలకు రేటింగ్ ఇచ్చే పనిని అప్పగించే ముందు రెండు వాయిదాలలో రూ.21,990 చెల్లించాలని కోరారు. మోసగాళ్లు బాధితుడికి కమిషన్‌ కింద తిరిగి రూ.24,809 చెల్లించారు. అనంతరం ఎనిమిది రివ్యూలకు రూ.80 వేలు చెల్లించాలని కోరగా.. ఆదేవిధంగా చెల్లించాడు. తద్వారా బాధితుడికి తిరిగి రూ.94,840 ఇచ్చారు.

కొంతకాలం తర్వాత రూ.35.25 లక్షలు చెల్లించాలని కోరారు. వారు అడిగిన మొత్తం చెల్లించి, ఇచ్చిన పనిని పూర్తి చేసినప్పటికీ, బాధితుడికి రావల్పిన కమీషన్ రాకపోగా.. మరింత పెట్టుబడి పెట్టాలని కోరారు. అలాచేస్తే పెండింగ్‌లో ఉన్న వాటితో సహా మొత్తం సొమ్ము ఒకేసారి క్లియర్ చేస్తామన్నారు. దీంతో బాధితుడు 61.32 లక్షల రూపాయలను రెండవసారి బదిలీ చేశాడు. ఇలా నెట్ బ్యాంకింగ్, జీ-పే, పేటీఎంల ద్వారా బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాలకు 58 లావాదేవీలు జరిపాడు. గతేడాది సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ 5 మధ్య కాలంలో పలు మార్లు వివిధ వాయిదాల ద్వారా రూ. 96.57 లక్షలు సమర్పించుకున్నాడు. అసలుతోపాటు కమీషన్ కూడా చెల్లించకపోవడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విధమైన మోసాలకు గురికాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.