AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఛీ.. అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా..?’ నటిపై నెటిజన్ల ఫైర్‌

సినిమా అవకాశాల కోసమో..  సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ కోసమో గ్లామరస్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడానికి హద్దులు చెరిపేస్తున్నారు నేటి తరం తారామణులు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి కూడా ఆలోచించడం లేదు. తాజాగా నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది..

'ఛీ.. అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా..?' నటిపై నెటిజన్ల ఫైర్‌
Samyuktha Hegde
Srilakshmi C
|

Updated on: May 08, 2023 | 2:01 PM

Share

సినిమా అవకాశాల కోసమో..  సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ కోసమో గ్లామరస్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడానికి హద్దులు చెరిపేస్తున్నారు నేటి తరం తారామణులు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి కూడా ఆలోచించడం లేదు. తాజాగా నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఈ శాండిల్‌ వుడ్‌ బ్యూటీ ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని హల్‌ చల్‌ చేసింది. కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనువిందు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. గతంలో నటించిన చిత్రాలు చాలావరకు సక్సెస్‌ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో గ్లామర్‌ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

సోషల్‌ మీడియా వేదికగా గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. తాజాగా మరో అడుగుముందుకేసి ఏకంగా స్విమ్మింగ్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది. సముద్రంలో నీళ్లపై తేలియాడుతూ స్విమ్‌ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘సముద్రం చాలా లోతైనది, ప్రమాదకరమైనది. ఐతే ప్రతి ఒక్కరూ దానిలో మునిగిపోలేరు. కానీ అలా మునిగిపోని వారు సరికొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తారు. సరికొత్త జీవితాన్ని అనుభవిస్తారు! చివరికి దాని లోతు అర్ధమవుతుంది. దాని ప్రమాదం ఉత్సాహంగా మారుతుంది..’ అంటూ సముద్రంలో స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సంయుక్త హెగ్డేను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్‌ ఎంతవరకు ఫలితానిస్తాయనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే