AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushi Movie: “ఖుషి” ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. మరింత బ్యూటిఫుల్‏గా విజయ్.. సమంత సాంగ్..

ఇటీవల సామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతోపాటు.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూడ్డానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.

Kushi Movie: “ఖుషి” ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. మరింత బ్యూటిఫుల్‏గా విజయ్.. సమంత సాంగ్..
Kushi Song
Rajitha Chanti
|

Updated on: May 07, 2023 | 11:58 AM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న లేటేస్టి చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్‏గా నటిస్తోంది. మొదటిసారి సామ్, విజయ్ కాంబోలో వస్తోన్న ప్రేమకథ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా రోజుల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డే్ట్స్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతోపాటు.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూడ్డానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.

అయితే ఇందులో సమంత, విజయ్ లుక్స్ బ్యూటిఫుల్ గా కకనిపిస్తుండగా.. వారి ఇద్దరి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సామ్ ముస్లీం యువతిగా నటించనున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెడలో నల్లపూసలు.. నుదుటిన బొట్టుతో కనిపించింది సామ్. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.

ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..