Kareena Kapoor: ‘కరీనా.. ఒక్కసారి నిన్ను టచ్ చేస్తా ప్లీజ్..!’ నటికి ఫ్యాన్ రిక్వెస్ట్‌

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లైనా కరీనా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను కలిసేందుకు, సెల్ఫీ దిగేందుకు వస్తుంటారు. తాజాగా ముంబయిలోని ఓ హోటల్‌కు..

Kareena Kapoor: 'కరీనా.. ఒక్కసారి నిన్ను టచ్ చేస్తా ప్లీజ్..!' నటికి ఫ్యాన్ రిక్వెస్ట్‌
Kareena Kapoor
Follow us

|

Updated on: May 07, 2023 | 1:07 PM

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లైనా కరీనా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను కలిసేందుకు, సెల్ఫీ దిగేందుకు వస్తుంటారు. తాజాగా ముంబయిలోని ఓ హోటల్‌కు కరీనా-సైఫ్‌ జంట డిన్నర్‌కు వెళ్లారు. రెస్టారెంట్ ముందు తమ కారు ఆపిన తర్వాత, సైప్‌-కరీనా నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే టైంకి ఓ మహిళా ఫ్యాన్ అక్కడకు వచ్చింది.

‘ఒక్కసారి నీ చేతులను టచ్ చేస్తాను’ అంటూ కరీనాను తాకేందుకు చేయి ముందుకు చాచింది. ఐతే కరీనా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా అభిమాని ఆమెను బతిమిలాడుతూ వెంటపడగా.. పక్కనే ఉన్న సెక్యురిటీ గార్డు ఆమెను పక్కకు తోసేస్తాడు. కరీనా కూడా పట్టించుకోనట్టుగా వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మహిళా అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తే తప్పేంటని కొందరు ప్రశ్నించగా.. మరికొందరేమో సెలబ్రిటీలు మాత్రమేకాదు సామాన్యులెవరైనా ఇలాగే చేస్తారు. ఆమె చూడటానికి భయంకరంగా ఉందంటూ కరీనా తీరును సమర్ధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా సెలబ్రిటీలను కలిసేందుకు ఫ్యాన్స్ దగ్గరకు వస్తే చిరాకు పడుతుండటం ఇదేం తొలిసారికాదు. తాజాగా షారుఖ్ ఖాన్ కూడా ఓ అభిమానితో అనుచితంగా ప్రవర్తించి సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యాడు. ముంబాయి ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న షారుక్‌తో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు యత్నించగా.. షారుఖ్ అతన్ని చేతితో తోసేశాడు. కనీసం తిరిగైనా చూడకుండే వెళ్లిపోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయ్యింది. ఇక సినిమాల విషయాని కోస్తే.. కరీనా చివరిసారిగా లాల్ సింగ్ చద్దా చిత్రంలో కనిపించింది. ఆమె తదుపరి మువీ రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది క్రూ’లో నటిస్తున్నారు. దీనిలో కృతి సనన్, దిల్జిత్ దోసాంజ్, టబు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు