Navdeep : ‘ఆ హీరోయిన్ చనిపోవడానికి నేను కారణం కాదు’.. హీరో నవదీప్ క్లారిటీ..
తాజాగా తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించారు నవదీప్. చాలా ఏళ్ల తర్వాత ఆయన నటిస్తోన్న వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఇది ఆహాలో మే12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నవదీప్.
జై సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు నవదీప్. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సంపాదించడమే కాకుండా.. ఆ తర్వాత హీరోగా నవదీప్కు మరిన్ని అవకాశాలు వచ్చాయి. గౌతమ్ ఎస్ఎస్సీ, చందమామ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. తర్వాతి రోజుల్లో హీరోగానే కాకుండా సెకండ్ లీడ్, నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించారు. చాలా కాలంగా నవదీప్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కెరీర్ మొదట్లో నవదీప్ సినిమాల విషయాలకే కాకుండా.. వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. గతంలో తన ఇంట్లో రేవ్ పార్టీ ఇస్తూ పోలీసులకు దొరికారని.. అతని వల్ల ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందని.. చివరకు అతను గే అని ఇలా అనేక వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాలపై నవదీప్ అప్పట్లో రియాక్ట్ కాలేదు. తాజాగా తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించారు నవదీప్. చాలా ఏళ్ల తర్వాత ఆయన నటిస్తోన్న వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఇది ఆహాలో మే12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నవదీప్.
“2005లో ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకోవడానికి నేనే కారణమని పేపర్ లో రాశారు.. కానీ అందులో నిజం లేదు.. ఆమె సూసైడ్ చేసుకోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఓసారి నేను గే అని రాశారు.. కానీ అందరిలో నేను గే కాదు అని ప్రూవ్ చేయలేను.. అలాగే నా ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందంటూ వచ్చిన వార్తలలో సైతం నిజం లేదు.. ఎందుకంటే ఆరోజు నేను మా అమ్మతో కలిసి ఫామ్ హౌస్ లో డిన్నర్ చేశాము.. మా అమ్మ నాతోపాటు ఉండడం వల్ల ఆమె పై కూడా వార్తలలు రాశారు. తప్పుడు వార్తలతో మా ఇంట్లోనే నన్ను అనుమానించే పరిస్థితులు వచ్చాయి” అంటూ చెప్పుకొచ్చారు నవదీప్.
నవదీప్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న న్యూసెన్స్ వెబ్ సిరీస్ లో బింధుమాదవి ప్రధాన పాత్రలో నటిస్తుంది. దీనిని డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.