Marriage: తప్పతాగి పెళ్లికూతురుపై సింధూరం చల్లిన వరుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు

పెళ్లి అనగానే ఇంట్లో బోలెడు సందడి. బంధుమిత్రులు, బాజాభజంత్రీలతో ప్రారంభమై అతిథుల సాక్షిగా రెండు మనసులు ముడిపడటమే పెళ్లి. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే. ప్రతి ఒక్కరి జీతంలో ఈ వేడుక ప్రత్యేకమే. ఐతే ఇటీవల కాలంలో..

Marriage: తప్పతాగి పెళ్లికూతురుపై సింధూరం చల్లిన వరుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు
Bride Cancels Wedding
Follow us
Srilakshmi C

|

Updated on: May 07, 2023 | 12:39 PM

పెళ్లి అనగానే ఇంట్లో బోలెడు సందడి. బంధుమిత్రులు, బాజాభజంత్రీలతో ప్రారంభమై అతిథుల సాక్షిగా రెండు మనసులు ముడిపడటమే పెళ్లి. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే. ప్రతి ఒక్కరి జీతంలో ఈ వేడుక ప్రత్యేకమే. ఐతే ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకు పెళ్లిళ్లు ఆగిపోతుండటం చూస్తూనే ఉన్నాం. చీర నచ్చకపోవడం, మేకప్ సరిగ్గా లేకపోవడం, పెళ్లి వింధులో అప్పడాలు వేయలేదని, మర్యాదలు చేయలేదని.. ఇలా చిన్న కారణాలకే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో వరుడు తరపు బంధువులు తప్పతాగి రావడం మూలంగా పెళ్లిళ్లు చెడిపోవడం కూడా షరా మామూలే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా మాణిక్ పుర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. మూహూర్తం సమయానికి తప్పతాగి పెళ్లి మండపానికి వచ్చిన వరుడు ఓ తిక్కపని చేశాడు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన వధువు వివాహాన్ని రద్దు చేసుకుని గుడ్‌బై చెప్పింది.

ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లా మాణిక్ పుర్‌లో శుక్రవారం సాయంత్రం వివాహాం జరుగుతోంది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వధూవరులు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకువచ్చారు. ఐతే పెళ్లికొడుకు ఫూటుగా మద్యం సేవించి తూగుతూ వచ్చాడు. తాగిన మైకంలో వధువుకు బోట్టు కూడా పెట్టలేక.. వధువుపై సిందూరాన్ని చల్లడం ప్రారంభించాడు. ఆపే ప్రయత్నం చేసిన వధువుపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో వధువు వివాహానికి నిరాకరించి మండపం నుంచి వాకౌట్‌ చేసింది. ఈ ఘటనపై వధువు తరపు బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో కేసుపెట్టగా.. వివాహ ఖర్చులను చెల్లించడానికి వరుడి కుటుంబం అంగీకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే