Amit Shah: నెక్స్ట్ తెలంగాణలో అధికారం పక్కా..! అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

Amit Shah with TV9: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన సుడిగాలి పర్యటనలతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉన్న క్రమంలో ‘TV9 చానల్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ

Amit Shah: నెక్స్ట్ తెలంగాణలో అధికారం పక్కా..! అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
Union Home Minister Amit Shah
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 08, 2023 | 5:16 PM

Amit Shah with TV9: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన సుడిగాలి పర్యటనలతో పాటు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉన్న క్రమంలో ‘TV9 చానల్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటి అధికారం నిలబెట్టుకుంటుందని అమిత్‌ షా గట్టి దీమాతో చెప్పారు. ‘ఫస్ట్ కర్నాటక.. నెక్స్ట్ తెలంగాణ’లో అధికారం స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక లో బీజేపీ విజయం కోసం కావలసిన మ్యాజిక్‌ మార్క్‌ను దాటి మరో 15 సీట్లు ఎక్కువే గెలుస్తుందన్నారు అమిత్ షా.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ చేస్తోన్న 40 శాతం కమీషన్‌ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కానీ బోఫోర్స్, 2జీ స్కామ్‌లకు ఆధారాలు ఉన్నాయని, ఈడీ చార్జీషీట్లు ఉన్న వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మరన్నారు. ఇంకా బీజేపీని వీడినవారు కర్నాటక ఎన్నికల్లో గెలవలేరని గట్టిగా చెప్పారు. ఇంకా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలపడుతోందని, తెలంగాణలోనూ సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.

కాగా, 224 అసెంబ్లీ సీట్ల కోసం ఈ నెల 10న కర్నాటక ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ తన అధికారం కాపాడుకునేందుకు కనీసంగా 113 స్థానాలలో గెలుపొందాలి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న విడుదలవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..