Offer Sale: ‘లెనోవా లాప్‌టాప్స్’పై అద్దిరిపోయే ఆఫర్.. నేరుగా రూ.55,900 తగ్గింపు.. ఇంకెన్నో డిస్కౌంట్ ఆప్షన్స్..

Lenovo Laptop: భారతదేశంలోని ల్యాప్‌టాప్ మార్కెట్‌లో లెనోవాకు మంచి పేరు ఉంది. విపరీతంగా పెరిగిపోతున్న టెక్ రంగానికి అనుగుణంగా లెనోవా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తుంటుంది. అయితే తాజాగా లెనోవా కంపెనీ ఓ ల్యాప్‌టాప్

Offer Sale: ‘లెనోవా లాప్‌టాప్స్’పై అద్దిరిపోయే ఆఫర్.. నేరుగా రూ.55,900 తగ్గింపు.. ఇంకెన్నో డిస్కౌంట్ ఆప్షన్స్..
Lenovo Laptops
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 08, 2023 | 3:20 PM

భారతదేశంలోని ల్యాప్‌టాప్ మార్కెట్‌లో లెనోవాకు మంచి పేరు ఉంది. విపరీతంగా పెరిగిపోతున్న టెక్ రంగానికి అనుగుణంగా లెనోవా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తుంటుంది. అయితే తాజాగా లెనోవా కంపెనీ ఓ ల్యాప్‌టాప్ మోడల్‌పై ఏకంగా రూ.55,900 తగ్గింపు ఆఫర్‌ని ప్రకటించింది. Yoga Slim 7i Pro X మోడల్ ల్యాప్‌టాప్‌పై ఈ ఆఫర్ అమలులో ఉంది. ఈ ఒక్క మోడల్‌పైనే కాక Lenovo IdeaPad Slim 3, Lenovo Yoga Slim 7 వంటి ఇతర ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కలిగిన Lenovo Yoga Slim 7i Pro X  ల్యాప్‌టాప్ మీకు 1,59,990 రూపాయలకే లభిస్తుంది. వాస్తవానికి దీని ధర రూ.2,15,890. అయితే అంత అవసరం లేకుండానే రూ.55,900 తగ్గింపు ఆఫర్‌తో మీరు దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంకా మీకు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ.1,750 తగ్గించుకోవచ్చు. మీకు కావాలంటే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సర్వీస్ ద్వారా లేదా నో-కాస్ట్ EMI ద్వారా మీరు దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Yoga Slim 7i Pro X

Yoga Slim 7i Pro X

డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్న మరో ల్యాప్‌టాప్  Lenovo IdeaPad Slim 3 Intel Core i3 11th Gen. విండోస్ 11 ఓఎస్‌ కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను 46 శాతం తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 59,390, కానీ మీరు దీన్ని కేవలం రూ. 31,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్  వస్తుంది. ఈ విధమైన ఆఫర్‌లో వస్తున్న Lenovo Yoga Slim 7 Intel Core i5 10th Gen ల్యాప్‌టాప్‌పై కూడా 37 శాతం తగ్గింపు పొందవచ్చు. దీని అసలు ధర రూ. 1,13,390 అయినప్పటికీ రూ.70,990లకే కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..