Shani Sade Sati: శని బాధలతో ఇబ్బంది పడుతున్నారా..? నల్ల మిరియాలను ఇలా ఉపయోగించారంటే.. మీ పంట పండినట్లే..!
Shani Sade Sati: సనాతన హిందూ ధర్మంలో శనిదేవుడిని న్యాయదేవుడిగా కూడా పూజిస్తారు. ఆయన మనం మంచి పనులు చేస్తే వాటికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ప్రాప్తించేలా చేస్తాడు. అలాగే ఏ వ్యక్తిపైన అయినా శని సడేసతి ఏడున్నర..
Shani Sade Sati: సనాతన హిందూ ధర్మంలో శనిదేవుడిని న్యాయదేవుడిగా కూడా పూజిస్తారు. ఆయన మనం మంచి పనులు చేస్తే వాటికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ప్రాప్తించేలా చేస్తాడు. అలాగే ఏ వ్యక్తిపైన అయినా శని సడేసతి ఏడున్నర ఏళ్లు ఉంటుంది. ఈ క్రమంలో గ్రహాలు, నక్షత్రాల స్థానంతో పాటు వాటి దిశ కూడా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యంలో గ్రహాలను శాంతింపచేయడానికి పలు నివారణలున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శని సడేసతి నుంచి తప్పించుకోవడంలో మిరియాలు ఎంతో దోహదపడతాయని వారు వివరిస్తున్నారు. అంటే వంటగదిలోని నల్ల మిరియాలు ఆరోగ్యానికే కాక శని బాధలను తొలగించడంలో కూడా ఉపయోగపడతాయి. మరి నల్ల మిరియాలను ఏ విధంగా ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- 5 నల్ల మిరియాలను తీసుకొని వాటిని మీ తలపై 7 సార్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత ఏదైనా కూడలి వద్ద లేదా ఎవరూ లేనిచోట నిలబడి నాలుగు దిక్కులకు నాలుగు విసిరి, ఐదో మిరియాన్ని ఆకాశంలోకి విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోవాలి.
- నల్ల మిరియాలు, 11 రూపాయలను ఒక నల్ల గుడ్డలో కట్టి పేదవారికి దానం చేయాలి. ఈ ఉపాయం వల్ల శని దేవుడి సడేసతి నుంచి విముక్తి కలుగుతుందట.
- ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో నల్ల మిరియాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచి, వాటి మీద అడుగు పెట్టాలి. అలా చేయడం వల్ల మీరు ఏ పని కోసమైతే వెళుతున్నారో అది విజయవంతంగా పూర్తవుతుంది.
- చెడు దృష్టి, దిష్టిని తొలగించడానికి కూడా నల్ల మరియాలను ఉపయోగిస్తారు. అందుకోసం ఇంట్లోని ఏదైనా మూలలో దీపం పెట్టి 7, 8 మిరియాలను కాల్చాలి. ఇలా చేయడం వల్ల వాస్తు, ఆర్థిక దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).