TS Inter Results: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపే ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకంట్ ఇయర్ ఫలితాలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సదరు బోర్టు తెలిపింది. అంతకముందు..

TS Inter Results: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపే ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?
Ts Inter Results
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 08, 2023 | 4:24 PM

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకంట్ ఇయర్ ఫలితాలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సదరు బోర్టు తెలిపింది. అంతకముందు ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.inను సందర్శించి, అందులో ఫస్ట్ ఇయర్ లేదా సెకెండియర్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆపై హాల్ టిక్కెట్ నెంబర్, పుట్టిన రోజు వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

కాగా, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి 2023 ఏప్రిల్ 3 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16, 2023 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్ రెండింటిలోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్షల్లో పాస్ కాని విద్యార్తులకు కొద్ది వారాల్లోనే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..